(Local) Wed, 24 Jul, 2019

రికార్డుస్థాయికి చేరుకున్న విదేశీ మారకం నిల్వలు

June 29, 2019,   2:36 PM IST
Share on:

విదేశీ మారకం నిల్వలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. జూన్ 21తో ముగిసిన వారంలో చారిత్రక గరిష్ఠ స్థాయి 426.42 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. అంతక్రితం వారంతో పోలిస్తే 4.215 బిలియన్ డాలర్ల మేర పెరిగాయని తెలిపింది. గతంలో ఏప్రిల్ 13, 2018న నమోదైన 426.028 బిలియన్ డాలర్ల ఇప్పటి వరకు ఇదే గరిష్ఠ స్థాయి. 

కానీ, గతవారంలో విదేశీ మారకం రూపంలో ఉన్న ఆస్తులు, ఇతర వాటి విలువ గణనీయంగా పెరుగడంతో రిజర్వులు కూడా అంతేస్థాయిలో దూసుకుపోయాయని తెలిపింది. అంతక్రితం వారంలో రిజర్వులు 1.358 బిలియన్ డాలర్లు తగ్గి 422.2 బిలియన్ డాలర్లకు జారుకున్న విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ భారీగా పుంజుకోవడం ఇందుకు దోహదం చేసిందని తాజా నివేదికలో తెలిపింది.

 గతవారంలో ఫారిన్ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ మరో 4.202 బిలియన్ డాలర్లు ఎగబాకి 398.649 బిలియన్ డాలర్లకు చేరాయి. డాలర్ రూపంలో ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ..యూరో, పౌండ్, యెన్ కరెన్సీల తరుగుదల/పెరుగుదల ఆధారంగా రిజర్వులు ఉంటాయి. 

మరోవైపు, గతవారంలో పసిడి రిజర్వులు యథాతథంగా ఉన్నాయి. ప్రస్తుతం 22.958 బిలియన్ డాలర్ల విలువైన పసిడి రిజర్వులు ఉన్నట్లు తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి కింద ఉండే రిజర్వులు 4.2 మిలియన్ డాలర్లు ఎగబాకి 1.453 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే ఫండ్ రూపంలో ఉన్న రిజర్వులు 9.6 మిలియన్ డాలర్లు పెరిగి 3.354 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.  

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.