(Local) Wed, 24 Jul, 2019

మరింత దిగజారిన దేశ వృద్ధిరేటు

June 21, 2019,   3:15 PM IST
Share on:

ఈ ఆర్థిక సంవత్సరం రెండో భాగంలోని దేశ ఆర్థిక వృద్ధిరేటు 6.6 శాతమేనని గ్లోబల్‌ రేటింగ్‌ ఏజన్సీ ఫిచ్‌ అంచనా వేసింది.2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో వృద్ధిరేటు 6.8శాతమే ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసింది.ఉత్పత్తి, వ్యవసాయరంగం గత ఏడాదిగా మాంద్యంలోకి దిగజారిన సూచనలే కనిపిస్తున్నాయి.ఇదే ఏజన్సీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో వృద్ధిరేటు 7 శాతం ఉండవచ్చునని అంచనావేసి ఆ తర్వాత దానిని సవరించింది.ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నదని కూడా ఆ ఏజన్సీ తెలియజేసింది.

25న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న సందర్భంలో వృద్ధిరేటు అంచనాను ఫిచ్‌ తగ్గించడం విశేషం..గత ఐదు సంవత్సరాలుగా ఆర్థిక వృద్ధి మాంద్యంలోనే ఉన్నది.2018-19 సంవత్సరంలో కూడా వృద్ధిరేటు 6.8శాతంగానేఉంది.జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధిరేటు ఐదేళ్ల కాలంలో చూసినప్పుడు మరింత తగ్గి 5.8శాతంగానే ఫిచ్‌ అంచనా వేసింది.ఇదే త్రైమా సికంలో చైనా వృద్ధిరేటు 6.5శాతంగా నమోదైంది.అంటే భారతదేశ వృద్ధి చైనా కంటే వేగంగా లేదు.2020-21లో వృద్థిరేటు 7.1శాతం ఉండవచ్చునని అంచనా వేసినప్పటికీ 2019-20లో మాత్రం 6.6 శాతం గానే ఉంటుందని ఫిచ్‌ తెలిపింది.

ఇదే సమయంలో భారత రిజర్వు బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 7శాతం ఉండవచ్చునని అంచనా..అయితే జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి తగ్గిపోయింది.ఆర్థిక వృద్ధిరేటు 2018 మొదటి త్రైమాసికంలో 8.1 శాతం ఉంటుందని అంచనావేసినప్పటికీ అది 5.8శాతానికి పడిపోయింది.గత ఐదేళ్ల కాలంలో చూస్తే ఇది అత్యంత తక్కువ వృద్ధిని నమోదు చేసింది.ఉత్పత్తిరంగం, వ్యవసాయం మాంద్యంలో ఉండటంవల్లనే ఆర్థికవృద్ధి కూడా తక్కువ గా ఉంది.అలాగే ఎగుమతుల వృద్ధి కూడా తగ్గింది.
ఆర్థికవృద్ధి బలహీనంగా ఉన్న నేపధ్యంలో రిజర్వుబ్యాంకు ఈ నెలలో జరిగిన సమావేశంలో ఈ ఏడాది 3వసారి కూడా వడ్డీరేటును 0.25శాతం తగ్గించింది.

ఈ ఏడాది చివరినాటికి మరొ 25 బేసిక్‌ పాయింట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనావేసింది.మౌలిక సదుపాయాలు, వినిమయం, వృద్ధిని అంచనావేసి బ్యాంకింగేతర ఆర్థికకంపెనీలు రుణపంపిణీని తగ్గించాయి.బ్యాంకులు రుణపంపిణీని పెంచడం ద్వారా కొంతవరకు ఈ లోటును సర్దుబాటు చేసాయి.
ఇదే సమయంలో ప్రపంచ ఆర్థికవృద్ధి ఈ ఏడాది 2.8శాతంగా ఉండవచ్చునని ఫిచ్‌ అంచనా వేసింది.2018లో ఆర్థికవృద్ధి 3.2శాతంగా నమోదైంది.అంటే ప్రపంచ ఆర్థికవృద్ధికూడా మాంద్యంలోనే కొనసాగుతుందని స్పష్టమవుతుంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.