(Local) Thu, 21 Nov, 2019

ఇక పై రోజుకు ఒక్కసారే ఏటీఎం నుంచి నగదు డ్రా ?

August 28, 2019,   12:05 PM IST
Share on:
ఇక పై రోజుకు ఒక్కసారే ఏటీఎం నుంచి నగదు డ్రా ?

బ్యాంకు, ఏటిఎంలలో పెరుగుతున్న మోసాలను నియంత్రించే దిశగా ఢిల్లీ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ పలు కీలక ప్రతిపాదనలు చేసింది. ఇక పై రోజుకు ఒక్కసారి మాత్రమే ఏటిఎం నుంచి నగదు డ్రా చేసేలా, ప్రతి లావాదేవికి 6 గంటల నుంచి 12 గంటల సమయం ఉండేలా నిబంధనలు చేర్చాలని సూచించింది. ఇక ఏటిఎంలకు సెంట్రలైజ్ డ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ కమిటి పేర్కొంది. అయితే వీటి సాధ్యాసాధ్యాలను బ్యాంకర్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. రోజుకు ఒక్కసారి 25 వేల రూపాయల వరకు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దీని ద్వారా ప్రజలకు ఇబ్బందులు తప్పవని, వీటిని అమలు చేయవద్దని పలువురు కోరుతున్నారు. బ్యాంకర్స్ కమిటి కేవలం ప్రతిపాదనలు మాత్రమే పంపిందని దీని పై అపోహ వద్దని బ్యాంకర్స్ అధికారులు తెలిపారు. అయితే ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం చేస్తారా లేక దేశవ్యాప్తంగా అమలు చేస్తారా అనే దాని పై స్పష్టత లేదు.

సంబంధిత వర్గం
పీఎం కిసాన్‌ యోజనకు నేరుగా దరఖాస్తు
పీఎం కిసాన్‌ యోజనకు నేరుగా దరఖాస్తు
బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త
బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.