(Local) Wed, 24 Jul, 2019

అనిల్‌ అంబానీపై చైనాకు చెందిన బ్యాంకుల ఒత్తిడి

June 18, 2019,   12:35 PM IST
Share on:

ఆర్‌కామ్‌ సంస్థ యజమాని అనిల్‌ అంబానీకి చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకు రుణాలిచ్చింది. ఆర్‌కామ్‌ దివాలా ప్రక్రియలో భాగంగా రుణదాతల జాబితాను విడుదల చేసింది. ఆర్‌కామ్‌ ఇప్పుడు 2.1 బిలియన్‌ డాలర్లను చైనాకు చెందిన బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. వీటిని తక్షణమే చెల్లించాలని ఆయా బ్యాంకులు అనిల్‌ అంబానీపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆర్‌ కామ్‌ చెల్లించాల్సిన అప్పు విలువ రూ.57,382 కోట్లుగా ఈ జాబితాలో పేర్కొన్నారు. 
చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకుకు రూ.9,860 కోట్లు, ఎక్సిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ.3,360 కోట్లు, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ. 1,554 కోట్లు చెల్లించాలి. ఇప్పటికే అప్పులు తీర్చేందుకు అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ ఆస్తులను రూ. 17,300 కోట్లకు జియోకు విక్రయించేందుకు డీల్  చేసుకున్నారు. కానీ, వివిధ న్యాయ, ఇతర అంశాలతో ఈ డీల్‌ నిలిచిపోయింది. గతంలో మార్చిలో అనిల్‌ అంబానీ జైలు శిక్ష ఎదుర్కొనే పరిస్థితి రావడంతో ఆయన సోదరుడు ముఖేష్‌ అంబానీ రంగంలోకి దిగి 80 మిలియన్‌ డాలర్లను ఎరిక్సన్‌కు చెల్లించారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.