(Local) Tue, 02 Jun, 2020

4న పార్లమెంటుకు ఆర్ధికసర్వే

July 03, 2019,   12:45 PM IST
Share on:
4న పార్లమెంటుకు ఆర్ధికసర్వే

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొత్త బడ్జెట్‌ను ఐదవ తేదీ ప్రవేశపెడుతున్న సందర్భంగా అంతకు ముందు రోజే గురువారం ప్రధాన ఆర్ధిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ ఆర్ధిక సర్వేను  పార్లమెంట్‌లోప్రవేశపెడుతున్నారు. అటు మంత్రికి మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడం, ఇటు కృష్ణమూర్తికి సైతం మొట్టమొదటి ఆర్ధికసర్వే నివేదిక కావడంతో ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. సర్వేలో వివిధ ప్రభుత్వ అభివృద్ధి పథకాల పనితీరు, విధాన నిర్ణియాల కార్యాచరణ ఆర్ధిక వ్యవస్థపై ప్రభుత్వ ప్రగతి తీరుతెన్నులు వంటివి ఉంటాయి. గత ఏడాదే కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ను ప్రధాన ఆర్ధిక సలహాదారుగా నియమించారు. అప్పటివరకూ పని చేసిన అరవింద్‌ సుబ్రహ్మణియన్‌ ఆపదవినుంచి వైదొలిగిన తర్వాత కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ను నియమించారు. మొత్తం వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం, అక్షరాస్యత, శిశుమరణాలు, వైద్యఆరోగ్యం, ప్రాథమిక స్థాయినుంచి ఉన్నత విద్య, కార్పొరేట్‌రంగం, ఆర్ధిక వ్యవస్థ తీరు తెన్నులను అద్దంపట్టే ఆర్ధిక నివేదిక కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.