(Local) Wed, 24 Jul, 2019

ప్రముఖ వ్యాపారవేత్త బసంత్ కుమార్ బిర్లా కన్నుమూత

July 04, 2019,   2:00 PM IST
Share on:

ప్రముఖ వ్యాపారవేత్త బసంత్ కుమార్ బిర్లా బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. ఆయన కుమార మంగళం బిర్లా తాత అయిన బసంత్ కుమార్ ‘బికె’గా అందరికీ తెలుసు. సెంచురీ టెక్స్‌టైల్స్, ఇండస్ట్రీస్ చైర్మన్ బిర్లా తన 15వ ఏట నుంచి వ్యాపారంలో చురుగ్గా ఉండేవారు. పారిశ్రామికవేత్త, మహాదాత ఘనశ్యామ్ దాస్ బిర్లా చిన్న కుమారుడు బసంత్ బిర్లా వ్యాపార కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించారు. కెశోరామ్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ఆయన సేవలను ప్రారంభించారు. ప్రత్యేకించి కాటన్, విస్కోస్, పాలిస్టర్, నైలాన్ నూలు, రిఫ్రాక్టరీ, కాగితం, షిప్పింగ్, టైర్‌కార్డ్, పారదర్శక కాగితం, స్పున్ పైప్, సిమెంట్, టీ, కాఫీ, రసాయనాలు, ప్లైవుడ్ వంటి వాటిలో ఆయన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. కుమార మంగళం బిర్లా తండ్రి ఆదిత్య విక్రమ్ బిర్లా 1995లో కన్నుమూశారు. విక్రమ్ బిర్లా బసంత్ బిర్లా ఒక్కగానొక్క కుమారుడు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.