(Local) Sun, 20 Oct, 2019

తీవ్ర సంక్షభంలో ఆటోమొబైల్ పరిశ్రమ ...

August 20, 2019,   12:45 PM IST
Share on:
తీవ్ర సంక్షభంలో ఆటోమొబైల్ పరిశ్రమ ...

టాటా మోటార్స్‌.. మారుతీ సుజుకీ.. మహీంద్రా అండ్‌ మహీంద్రా.. హీరో మోటోకార్ప్‌.. వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇటీవల కాలంలో ఆర్థిక సంక్షోభానికి బెంబేలెత్తిపోతున్నాయి. 11 నెలల నుంచి వాహన రంగంలో కొనుగోళ్లు గణనీయంగా తగ్గుతున్నాయి. ఇక ప్యాసింజర్‌ వాహనాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వరుసగా తొమ్మిది నెలల నుంచి కొనుగోళ్లు నేలచూపులు చూస్తున్నాయి. ఫలితంగా దేశంలోని చాలా కంపెనీలు ఉత్పత్తిని తగ్గించేశాయి. ఇప్పటికే ఖర్చుకు కళ్లెం వేయడానికి తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

గత ఏడాదితో పోలిస్తే డిమాండ్‌ 31శాతం తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2000 సంవత్సరం తర్వాత డిమాండ్‌ ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి. ఫలితంగా ఇప్పటికే ఆటోమొబైల్‌, అనుబంధ రంగాల్లో 2.15లక్షల ఉద్యోగాలు పోయాయి. దేశంలో అత్యధికంగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న వాటిల్లో ఆటోమొబైల్‌ పరిశ్రమ రెండో స్థానంలో ఉంది.. దాదాపు 3.5కోట్లకుపైగా కుటుంబాలు ఆటోమొబైల్‌ పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. గిరాకీ లేనందున, ఉత్పత్తి తగ్గించేందుకు వాహన, విడిభాగాల కంపెనీలు కూడా కొన్ని రోజుల పాటు ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నాయి. హీరో మోటో ఈ నెల 15-18 వరకు, టీవీఎస్‌ గ్రూప్‌నకు చెందిన సుందరమ్‌ క్లేటాన్‌(ఎస్‌సీఎల్‌) 2 రోజులు, లూకాస్‌-టీవీఎస్‌ 2 రోజులు ఉత్పత్తి నిలిపేశాయి. బాష్‌ సైతం తన రెండు ప్లాంట్లను 13 రోజుల పాటు, ప్రస్తుత త్రైమాసికంలో 8-14 రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు ఎం అండ్‌ ఎం తెలిపింది

సంబంధిత వర్గం
కారు కొంటే స్కూటర్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ
కారు కొంటే స్కూటర్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.