(Local) Wed, 24 Jul, 2019

పేపర్ బాయ్స్ కి సెల్యూట్ చేసిన పారిశ్రామిక దిగ్గజం

July 03, 2019,   1:40 PM IST
Share on:

భారీ వర్షాల కారణంగా ముంబయిలో విమానాలు నడవట్లేదు.. రైల్వేస్టేషన్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. పాఠశాలలు మూతబడ్డాయి.. అయినప్పటికీ ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇంటికి సకాలంలో వార్తాపత్రిక వచ్చిందట. దీంతో ఆ పేపర్ వేసిన బాయ్‌కి ట్విటర్ వేదికగా సలాం చెప్పారు. ‘"మా ఇంటికి వార్తా పత్రిక మాత్రం సమయానికి వచ్చింది. అది కూడా ఏ మాత్రం తడవకుండా. ఇలా తీసుకొచ్చిన ఆ హీరోలకు సెల్యూట్ చేస్తున్నా. పేపర్ బాయ్స్ భారీ వర్షాలను సైతం ధైర్యంగా ఎదుర్కొంటున్నారు’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఈ ట్వీట్ చేయగా కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. ఇప్పటికే 10వేల మందికి పైగా దీనిని లైక్ చేశారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.