(Local) Wed, 24 Jul, 2019

తెలంగాణలో అతిపెద్ద డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించిన అమెజాన్

June 20, 2019,   1:37 PM IST
Share on:

డెలివరీ సేవలను మెరుగుపర్చేందుకు గాను ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ తెలంగాణలో అతిపెద్ద డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించింది. గచ్చిబౌలిలో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఒక్క గచ్చిబౌలి ప్రాంతంలోనే కాకుండా రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లోనూ డెలివరీ సేవలను వేగవంతం చేస్తామని కంపెనీ తెలిపింది. తెలంగాణలో అమేజాన్ నిర్వహిస్తున్న 90 డెలివరీ కేంద్రాల్లో 12 సెంటర్లు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. తెలంగాణ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ, హైదరాబాద్‌లోని లాజిస్టిక్స్‌లో అనేక ఇకామర్స్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని అన్నారు.

తెలంగాణలో అమెజాన్ కమిట్‌మెంట్
1. 3.2 మిలియన్ క్యూబిక్ అడుగుల ఉత్పత్తి నిల్వ ప్రదేశంతో హైదరాబాద్లో  మూడు ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలు
2. లక్ష చదరపు అడుగుల ప్రాసెసింగ్ సామర్థంతో హైదరాబాద్‌లో రెండు సార్ట్ కేంద్రాలు
3. రాష్ట్రంలో సుమారు 90 అమెజాన్ సొంత, సర్వీస్ పాట్నర్ డెలివరీ స్టేషన్లు
4. తెలంగాణలో 2500 ‘ఐ హావ్ స్పేస్’ స్టోర్లు
5. రాష్ట్రంలో 17000 మంది విక్రేతలు
6. టాప్ 5 విభాగాలు.. స్మార్ట్ ఫోన్లు, లార్జ్ అప్లియెన్సెస్, ఫ్యాషన్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, కన్జూమబుల్స్.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.