(Local) Wed, 24 Jul, 2019

జిఎంఆర్ కి ప్రతిష్టాత్మక సిఐఐ సదరన్ రీజన్ 5ఎస్ ఎక్సలెన్స్ అవార్డు

June 20, 2019,   1:45 PM IST
Share on:

జిఎంఆర్ ఎరో టెక్నిక్ లిమిటెడ్ (జిఎటిఎల్) ‘భారీ పరిశ్రమ – సర్వీస్ విభాగం’లో ప్రతిష్టాత్మక సిఐఐ సదరన్ రీజన్ 5ఎస్ ఎక్సలెన్స్ అవార్డు19లో మొదటి స్థానాన్ని గెల్చుకుంది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రపంచ స్థాయి థర్డ్ పార్టీ ఎయిర్ ఫ్రేమ్ ‘మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్’ (ఎంఆర్‌ఒ) సేవలను అందించే జిఎటిఎల్ ఈనెల 14న చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా జిఎటిఎల్ సిఇఒ అశోక్ గోపినాథ్ మాట్లాడుతూ, నిరంతరం జిఎటిఎల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ, ఒక క్రమ పద్దతి కలిగిన ప్రదేశంగా తీర్చిదిద్దడానికి చేస్తున్న కృషికి ఈ అవార్డు నిదర్శనమని అన్నారు.పని ప్రదేశాన్ని మరింత మెరుగు పరచుకునే 5ఎస్ టెక్నిక్‌ను ఉపయోగించి తమ ప్రదేశాన్ని క్రమపద్ధతిలో పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామని అన్నారు. దీని వల్ల మా సర్వీస్ క్వాలిటీ పెరిగి, తద్వారా కస్టమర్ల సంతృప్తి పెరిగాయని, సంస్థ సామర్థ్యం, భద్రత కూడా పెరిగాయన్నారు. సంస్థలలో 5ఎస్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు కంపెనీలను ప్రోత్సహించడం కోసం సదరన్ రీజన్ ఏటా 5ఎస్ ఎక్సలెన్స్ అవార్డులతో సిఐఐ సత్కరిస్తుంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.