(Local) Mon, 18 Nov, 2019

ఫుడ్ డెలివరీ వాహనాలు 40 స్పీడ్ లోనే వెళ్లాలట !

August 27, 2019,   11:38 AM IST
Share on:
ఫుడ్ డెలివరీ వాహనాలు 40 స్పీడ్ లోనే వెళ్లాలట !

ఫుడ్ డెలివరీ వాహనాలపై మంగళూరు పోలీలసులు సరికొత్త ఆంక్షలు విధించారు. ఇకపై ఆ వాహనాలన్నీ 40 కిలోమీటర్ల వేగంలోపే ప్రయాణించాలని పోలీసు శాఖ పేర్కొంది. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ పీఎస్ హర్ష.. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. తమకు అందుతున్న ఫిర్యాదుల్లో ఫుడ్ డెలివరీ వాహనాలపైనే ఎక్కువగా వస్తున్నాయని, డెలివరీ బాయ్స్ అతివేగం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యదుల్లో నగర ప్రజలు పేర్కొన్నట్లు హర్ష తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఫుడ్ డెలివరీ వాహనాలు అతివేగంతో ఇబ్బందులు కలిగిస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందాయి. ఫుడ్ డెలివరీ వాహనాలకు జీపీఎస్ యాక్టివ్ చేసి ఉండడం వల్ల వేగ పరిమితి దాటిన వాహనాలను గుర్తించడం సులువని, ఇది అమలులో కూడా తేలిక అవుతుందని నగర కమిషన్ పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. తమకు ప్రజా ప్రయోజనం ముఖ్యమని, రోడ్లపై ప్రమాదాలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ హర్ష అన్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.