(Local) Wed, 20 Oct, 2021

'అమ్మాయిలస్సలే ఇనిపించుకోరు'....అంటున్న కారికేయ

October 17, 2019,   4:50 PM IST
Share on:
'అమ్మాయిలస్సలే ఇనిపించుకోరు'....అంటున్న కారికేయ

RX100 చిత్రంతో 2018 ఏడాదిలో సంచలన విజయాన్ని అందుకున్న యువ హీరో కార్తికేయ. ఆ తర్వాత  'హిప్పీ', 'గుణ 369' సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' మూవీలో ప్రతినాయకుడి పాత్రలో ప్రేక్షకులని మెప్పించాడు. తాజాగా కార్తికేయ మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌‌లో '90ml' చిత్రంతో రాబోతున్నాడు. న్యూ డైరెక్టర్ శేఖర్ రెడ్డి ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ 90ML చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాను కార్తికేయ హోమ్ బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఇప్పటికే హీరో తాలూకా ఫస్ట్ లుక్ విడుదల చేయగా..తాజాగా ‘ఇనిపించుకోరు ఇనిపించుకోరు’ అంటూ సాగే ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. “ఇనిపించుకోరు ఇనిపించుకోరు అమ్మాయిలస్సలే ఇనిపించుకోరు ఎంత సెప్పినా.. ఏమి సెప్పినా ఏడిపిస్తుంటారు.. ఏపుకుతింటారు అబ్బాయిలందరినీ ఆగం పట్టిస్తారు” అంటూ అమ్మాయిలపై సెటైర్ లాగా హీరో పాడే పాట ఇది.
 

సంబంధిత వర్గం
నిఖిల్‌ కోసం వస్తున్న మెగాస్టార్...
నిఖిల్‌ కోసం వస్తున్న మెగాస్టార్...
దేవదాస్ లాంటి కొడుకే పుట్టాలి....
దేవదాస్ లాంటి కొడుకే పుట్టాలి....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.