(Local) Tue, 18 May, 2021

నా జేబులో రెండు వందలు కూడా లేవు.....బాలీవుడ్ హీరో

August 14, 2019,   2:58 PM IST
Share on:
నా జేబులో రెండు వందలు కూడా లేవు.....బాలీవుడ్ హీరో

బాలీవుడ్ హీరో అక్కి నటించిన ‘మిషన్ మంగళ్’ చిత్రం రేపు ఆగష్టు 15న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. భారత్‌ చేపట్టిన ‘మంగళ్‌యాన్‌‌’ మిషన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తుండగా, విద్య బాలన్, తాప్సి, నిత్య మీనన్, సోనాక్షి సిన్హా, కృతి కొల్హారి, షర్మన్ జోషి కీలక పాత్రలో నటిస్తున్నారు.  వీళ్ళను వెనుక నుండి నడిపించి లోకానికి మహిళా శక్తిని చాటే రాకేష్ ధావన్ పాత్రలో అక్షయ్‌ కుమార్‌ రియలిస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు ఇస్రో మార్స్ ఆర్బిట్ మిషన్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి విదితమే. కాగా ‘మిషన్ మంగళ్’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో తన తొలి రోజులను గుర్తు చేసుకున్నాడు. ఫెయిల్యూర్స్‌ను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు అక్షయ్ బదులిస్తూ.. తాను చాలా కిందిస్థాయి నుంచి వచ్చానని .. ఎన్నో కష్టనష్టాలను అనుభవించే ఈ రోజు ఈ స్థాయికి వచ్చానని తెలిపాడు. కనీసం మూడునాలుగు సార్లు తన సినీ కెరియర్‌లో ఎత్తుపల్లాలను చూశానన్నాడు. ‘‘బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు నా జేబులో కనీసం రూ.200 కూడా లేవు. కానీ ఈ రోజు చాలా ఉంది.. నా ఇంటిని, కార్లను చూసుకున్నప్పుడు దేవుడు ఎంత దయగలవాడా అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను తక్కువ అని అనుకోవడం లేదని చెప్పాడు.

సంబంధిత వర్గం
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...
అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అవు ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.