(Local) Sat, 19 Oct, 2019

అర్జున్ రెడ్డి 2.0....

September 21, 2019,   3:07 PM IST
Share on:
అర్జున్ రెడ్డి 2.0....

'పెళ్లి చూపులు' సినిమా ద్వారా తెలుగు తెరకి హీరోగా పరిచయమైనా విజయ్ దేవరకొండ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ అభిమానులకి క్రేజి హీరోగా మారాడు. ‘డియర్ కామ్రేడ్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సంపాదించినప్పటికీ, కెరీర్ పరంగా ఏ మాత్రం జోరు తగ్గకుండా తాజాగా పలు చిత్రాలకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడిగా విజయ్ దేవరకొండ సిద్ధం అవుతున్నాడు. ‘మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు’ సినిమాతో విమర్శకులు ప్రశంసలు అందుకున్న దర్శకుడు క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల అయింది. పోస్టర్‌లో ముఖం మీద రక్తపు గాయాలతో విజయ్ సిగరెట్ కాలుస్తూ ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టు వుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ అర్జున్ రెడ్డి2 అంటూ కామెంట్లు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో మాదిరి ఈ సినిమాలో కూడా విజయ్ తాగుబోతులా కనిపిస్తున్నాడని చెబుతున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందట. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్ రామారావు, వల్లభ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేశ్, బ్రెజిల్ మోడల్ ఇజబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు పరాజయం పాలయ్యాక విజయ్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నాడు.
 

సంబంధిత వర్గం
లాభాల వైపు అడుగువేయబోతున్న హీరో నిర్మాత....
లాభాల వైపు అడుగువేయబోతున్న హీరో నిర్మాత....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.