(Local) Sat, 24 Jul, 2021

సైరా సినిమాతో మిల్కి బ్యూటీ ఫేట్ మారనుందా ?

October 04, 2019,   6:23 PM IST
Share on:
సైరా సినిమాతో మిల్కి బ్యూటీ ఫేట్ మారనుందా ?

కొంతమంది స్టార్స్ కి కొన్ని సినిమాలు అనుకోకుండా మంచి పేరుని తెస్తాయని తెలిసిందే. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ లో ఎందరో స్టార్స్ పక్కన నటించినప్పటికీ ఆమెకు చెప్పుకోతగ్గ స్టార్ డం మాత్రం కనిపించడం లేదు... తాజాగా 'సైరా నరసింహారెడ్డి' బ్లాక్ బస్టర్ టాక్ తో అటు తమన్నా ఫ్యాన్స్ తో పాటు తమన్నా కూడా ఈ సినిమా విషయంలో చాలా సంతోషంగా ఉంది. సైరాలో ఆమె పాత్ర గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. సైరాలో ఆమెది చిన్న పాత్ర అనుకున్నారు అంతా రిలీజ్ కి ముందు వరకు. కానీ సినిమాలో తమన్నాకు మంచి సీన్ ఇచ్చారు. పైగా నయనతార లాంటి లేడీ సూపర్ స్టార్ తో కలిసి నటించినప్పటికీ తమన్నాకే పేరు వచ్చింది. నయన్ కన్నా తమన్నా పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కడంతో పాటు ఆమెకు క్లైమాక్స్ లో మంచి సీన్స్ పడ్డాయని సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వర్గం
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.