(Local) Sun, 20 Oct, 2019

అన్నయ్య నాకు ప్రాణ దాత.....పవర్ స్టార్

August 22, 2019,   1:52 PM IST
Share on:
అన్నయ్య నాకు ప్రాణ దాత.....పవర్ స్టార్

ఆగష్టు 22న మెగాస్టార్ బర్త్ డే పురస్కరించుకొని శిల్పకళా వేదికలో జే మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో చిరు పుట్టిన రోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్,  అల్లు అర‌వింద్, సాయి ధ‌ర‌మ్ తేజ్, క‌ళ్యాణ్ దేవ్, డా.కె.వెంక‌టేశ్వ‌ర‌రావు, మెగాస్టార్ చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు స్వామినాయుడు, రాపాక వ‌ర‌ప్ర‌సాద్, అమెరికా ఎన్నారై.. మెగా బ్ల‌డ్ డ్రైవ్ నిర్వాహ‌కుడు న‌ట‌రాజ్,సురేష్ కొండేటి, కాస‌ర్ల శ్యామ్, గాయ‌ని మంగ్లీ త‌దిత‌రులు పాల్గొన్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ-`మెగా ఫ్యాన్స్ ని ఉత్తేజ పరిచారు, ఆయన చేసిన భావోద్వేగ ప్రసంగం వేడుకల్లో హైలైట్ గా నిలిచింది. ఈ వేడుకల్లో భాగంగా పవన్ మాట్లాడుతూ ఈ రోజు తాను పవర్ స్టార్ గా ఇక్కడికి రాలేదని మెగా అభిమానుల్లో ఒకడిగా ఇక్కడికి వచ్చానని అన్నారు. ఇది చాలా ప్ర‌త్యేక‌మైన సంవ‌త్స‌రం. ప్ర‌త్యేక‌మైన సందర్భ‌మిది. అన్న‌య్య అభిమానిగా అన్న‌య్య‌ను ఎలా చూడాల‌ని ఉవ్విళ్లూరానో అలాంటి సినిమా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. దేశం కోసం మ‌న నేల కోసం ఎంతో త్యాగం చేసిన స‌మ‌ర‌యోధుడి జీవితాన్ని సినిమాగా తీయ‌డం.. విభిన్న‌మైన క‌ళాకారులు వేరే భాష‌ల నుంచి వ‌చ్చిన వారు ఇందులో న‌టించారు. నాకు ఇద్ద‌రు ఇష్ట‌మైన వ్య‌క్తులు ఉన్నారు. ఒక‌రు అన్న‌య్య అయితే.. ఇంకొక‌రు అమితాబ్ బ‌చ్చ‌న్. వీళ్లిద్ద‌రూ నాకు జీవితంలో బ‌ల‌మైన స్ఫూర్తిప్ర‌దాత‌లు. అన్న‌య్య‌ను చూడ‌టానికి వెళ్లిన‌ప్పుడు అమితాబ్ బచ్చన్ ని క‌లిసే అరుదైన అవ‌కాశం ఈ సినిమా షూటింగ్ లో ల‌భించింది. 

 ఈ మధ్య తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్ధులు పదుల్లో చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే తాను కూడా ఇంటర్మీడియట్‌ ఫెయిల్ అయినప్పుడు చాలా నిరాశ చెందానని అన్నయ్య గన్‌ తో కాల్చుకుని చచ్చిపోదామని అనుకున్నానని, కాని అప్పుడు అన్నయ్య చెప్పిన మాట తనలో స్ఫూర్తి నింపిందని పవన్ పేర్కొన్నారు. ముందు నువ్వు బతకాలి, నీ బతుకు ఇంటర్‌లో లేదు. నీ దారి వేరే ఉందని అన్నయ్య చెప్పడంతో ధైర్యం కలిగి చావు గురించి ఆలోచించలేదని అన్నారు. అన్న లాంటి వ్యక్తి ప్రతి ఇంట్లో ఉంటే ఎవరూ చనిపోరని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు. అన్నయ్య అన్న మాటలే ఈరోజు మీ ముందు పవర్ స్టార్ గా నిలబెట్టాయని, అందుకే ఆయన నాకు స్పూర్తిప్రదాత అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు పవన్ కళ్యాణ్. 

సంబంధిత వర్గం
నవంబర్ లో పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ
నవంబర్ లో పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.