(Local) Sun, 25 Jul, 2021

మరో మైలు రాయి అందుకున్న 'వార్'

October 21, 2019,   5:33 PM IST
Share on:
మరో మైలు రాయి అందుకున్న 'వార్'

యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మాణంలో, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వార్’. ఈ యాక్షన్ థ్రిల్లర్...  మూవీలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా 3 భాషల్లో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ లో స్టార్టింగ్ లో కొంచం మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ పరంగా బాగా దూసుకుపోతోంది. తాజాగా ఈ 'వార్' మూవీ మరో మైలు రాయిని అందుకుంది. రీసెంట్‌గా ఈ చిత్రం రూ. 300 కోట్ల క్లబ్‌లో ఎంటరైంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ‘వార్’ రూ. 100 కోట్లు వసూలు చేసింది. హృతిక్, టైగర్‌ల పర్ఫార్మెన్స్, వాణీ కపూర్ గ్లామర్, యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా ‘వార్’ రూ. 300 కోట్ల  క్లబ్‌లో ఎంటరైంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘ధూమ్ 3’, ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’, ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమాల తర్వాత రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టింది ‘వార్’..‘బాహుబలి : ది బిగినింగ్’, ‘దంగల్’, ‘సంజూ’, ‘పీకే’, ‘టైగర్ జిందా హై’, ‘బజరంగీ భాయ్‌జాన్’, ‘పద్మావత్’, ‘సుల్తాన్’ సినిమాల తర్వాత బాలీవుడ్‌లో రూ. 300 కోట్లు వసులు చేసిన సినిమాగా ‘వార్’ రికార్డ్ క్రియేట్ చేసింది. హీరోలిద్దరితో పాటు దర్శకుడికీ కెరీర్‌లో ఫస్ట్ హైయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది ‘వార్’..

సంబంధిత వర్గం
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
కబీర్ ని దాటిన వార్....
కబీర్ ని దాటిన వార్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.