(Local) Mon, 02 Aug, 2021

వార్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే...

October 04, 2019,   4:09 PM IST
Share on:
వార్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ...

బాలీవుడ్ లో అక్టోబర్ 2న  హ్రితిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన యాక్షన్ ఫిలిం 'వార్' మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే ఎక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ మొదటి రోజు ఏకంగా ఎవరు ఊహించని విధంగా రూ.50 కోట్లు నెట్ వసూళ్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా రాకముందు వరకు 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' మొదటి స్థానంలో ఉండేది. 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' మొదటి రోజు 50 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ దాటిన మొదటి సినిమా కాగా ఇప్పుడు 'వార్' ఆ సినిమాను దాటేసింది. బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ సినిమా ఇంతలా కలెక్ట్ చేస్తుందని అనుకోలేదు. రివ్యూస్ కూడా యావరేజ్, డీసెంట్ అంటూ ఇచ్చారు కానీ కలెక్షన్స్ ఏమో ఒక రేంజ్ లో వస్తున్నాయి. ఇతర భాషల్లో కూడా ఈసినిమా కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ ఏడాది హయ్యెస్ట్ డే 1 కలెక్షన్స్ సాధించిన టాప్ - 6 హిందీ చిత్రాల లిస్టుమీకోసం ( ఇండియా - నెట్ కలెక్షన్స్)

1. వార్: 53.35 cr
2. 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' 50 cr
3. భారత్ 42.30 cr
4. మిషన్ మంగళ్: 29.16 cr
5. సాహో: 24.40 (హిందీ వెర్షన్)
6. కళంక్: 21.60 cr

సంబంధిత వర్గం
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.