(Local) Sat, 23 Jan, 2021

'వాకా వాకా' వీడియో సాంగ్ ప్రోమో....

September 18, 2019,   3:37 PM IST
Share on:
'వాకా వాకా' వీడియో సాంగ్ ప్రోమో....

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన చిత్రం "వాల్మీకి". హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ హీరోగా, అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏఈ నెల 20న విడుదల కానుంది. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రతి నాయకుడిగా తమిళ హీరో అధర్వ , మృణాళిని రవి జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి . తమిళ్ లో సూపర్ హిట్ అయినా జిగర్తాండ మూవీని రీమేక్ చేసి తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రయూనిట్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో ఈ మూవీ పై మెగా అభిమానుల అంచనాలు మరింత ఎక్కువయినా సంగతి తెలిసిందే. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్.. లిరికల్ సాంగ్స్ వరసగా రిలీజ్ చేస్తూపోతున్నారు.  తాజాగా ఈ సినిమా నుండి 'వాకా వాకా' అంటూ సాగే మరో వీడియో సాంగ్ ప్రోమో ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీత సమకూర్చగా  ఈ పాటకు సాహిత్యం అందించినవారు చంద్రబోస్. ఈ పాట సాహిత్యం అంతా సినిమాలో వరుణ్ తేజ్ పాత్రకి అనుగుణంగా తీర్చిదిద్దినట్టు, వరుణ్ తన గురించి తానే చెప్పుకుంటున్నట్టుగా పాట సాగుతుంది. "దడ దడ దడ దంచుడే.. గుండెల్లోకి పిడి దించుడే.. అడ్డం వచ్చినోడ్ని సంపుడే అద్దు పద్దులన్నీ సింపుడే" అంటూ చంద్రబోస్ ఫుల్లు మాసు స్టైల్ లో సాహిత్యం అందించారు. ఈ పాటను పాడినవారు అనురాగ్ కులకర్ణి. 

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.