(Local) Sat, 24 Jul, 2021

విశాల్ 'యాక్షన్' కి యూ/ఏ సర్టిఫికెట్...

November 14, 2019,   8:08 PM IST
Share on:
విశాల్ 'యాక్షన్' కి యూ/ఏ సర్టిఫికెట్...

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హీరోగా, తమన్నా, ఐశ్వర్య లక్ష్మి, హీరోయిన్స్ గా సుందర్‌ సి. డైరెక్షన్ లో రూపొందిన చిత్రం 'యాక్షన్'. ఈ చిత్రాన్ని తెలుగు అనువదించి అదే టైటిల్ తో రేపు నవంబర్ 15న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను తెలుగులో 'హుషారు', 'ఇస్మార్ట్‌ శంకర్‌', 'గద్దలకొండ గణేష్‌', 'రాజుగారిగది3' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన శ్రీనివాస్‌ ఆడెపు నిర్మాతగా శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ఈ హై ఓల్టేజ్‌ 'యాక్షన్‌' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు.

రేపు నవంబర్‌15న తమిళ్, తెలుగులో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాల 4 సెకన్లు, విశాల్, తమన్నా చేసిన రిస్కీ స్టంట్స్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయని సెన్సార్ టాక్. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, ఆకాంక్ష పూరి, ఛాయా సింగ్‌, రాంకీ, ప్రిన్స్, ఆనంద్ రాజ్, అనీష్ కురువిల్లా, కబీర్ దుహాన్ సింగ్, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మ్యూజిక్  హిప్ హాప్ అందించారు. 

సంబంధిత వర్గం
రివ్యూ: యాక్షన్
రివ్యూ: యాక్షన్
ర్యాప్ సాంగ్ తో అదరగడుతున్న దగ్గుబాటి హీరో....
ర్యాప్ సాంగ్ తో అదరగడుతున్న దగ్గుబాటి హీరో....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.