(Local) Tue, 20 Oct, 2020

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థులు...

October 24, 2019,   2:32 PM IST
Share on:
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థుల ...

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు అడ్డగించి, రహదారిపై బైఠాయించి మరి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్లగా...టీడీపీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు బాలకృష్ణ హిందూపురం వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చిన బాలయ్య అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హిందూపురం బయలుదేరారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బాలయ్య వస్తున్నారని తెలుసుకున్న గలిబిపల్లి గ్రామస్థులు కొడికొండ చెక్ పోస్టు నుంచి హిందూపురం వచ్చే రహదారిలో గలిబిపల్లి క్రాస్ వద్ద ఆయన కారును అడ్డుకున్నారు. బాలయ్య హామీ ఇచ్చే వరకూ ఆందోళనకు దిగారు.

లేపాక్షి-హిందూపురం మెయిన్ రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకు భూమి పూజ చేసి సంవత్సరం పూర్తవుతున్నా నేటికీ పూర్తి కాలేదని గ్రామస్థులు బాలయ్యకు దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్థుల సమస్యపై స్పందించిన బాలకృష్ణ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు వెనక్కి తగ్గారు. అక్కడి నుంచి ఆయన నేరుగా వివాహానికి హాజరయ్యారు. కాగా నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కోడికొండ చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు చేరుకొని స్వాగతం పలికారు. 

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.