(Local) Wed, 24 Jul, 2019

ఈ సాయంత్రం ‘మిస్టర్ KK’ ట్రైలర్ విడుదల

July 03, 2019,   5:04 PM IST
Share on:

చియాన్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. తన విలక్షణ నటనతో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ప్రేక్షకులను అశేషమైన అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న కొత్త సినిమా ‘కదరం కొండన్’, తెలుగులో ‘మిస్టర్ KK’గా అనువదిస్తున్నారు. కాగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ సొంత బ్యానరైన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్ అధినేత ఆర్ రవీంద్రన్ సంయుక్తంగా ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ నటిస్తోంది. ఇక కొన్నాళ్ల క్రితం విడుదలైన ఈ చిత్ర తమిళ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఇక తెలుగులో ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ట్రైలర్ మొత్తానికి సాయంత్రం విడుదలవుతుంది. మరి ఈ ట్రైలర్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. కాగా ఈ ‘కదరం కొండన్’ను తమిళంలో ఈ నెల 19న విడుదల చెయ్యాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో కూడా జూలై 19నే విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జూలై 19న కొబ్బరి మట్టా, ఆమె చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ‘చీకిటి రాజ్యం’ ఫేమ్ రాజేష్ ఎమ్ సెల్వ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమానైనా విక్రమ్ హిట్ ఇస్తుందేమో చూడాలి. 
 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.