(Local) Mon, 23 Sep, 2019

‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్న.......రౌడీ

August 29, 2019,   12:28 PM IST
Views: 73
Share on:
‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్న.......రౌడీ

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ 2016లో వచ్చిన పెళ్లి చూపులతో  సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్‌ సెన్సేషన్‌ క్రేజీ హీరో అయ్యాడు. అయితే ఇప్పటికే పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ తాజాగా ఈ క్రేజి హీరో కెరీర్ పరంగా మరో కొత్త అడుగు వేయబోతున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాణంలోకి కూడా దిగుతున్నాడు దేవరకొండ. ‘కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై యాంగ్ టాలెంట్ ప్రోత్సాహం అందించేందుకు తొలి అడుగు వేస్తున్నాడు. విజయ్ తన సొంత బ్యానర్‌లో సినిమా ప్లాన్ చేశాడు.  ఈ సినిమాకు టైటిల్ కూడా ప్రకటించారు. టైటిల్ కూడా చాలా వెరైటీగా ఉంది. అ టైటిల్‌ పేరు ‘ మీకు మాత్రమే చెప్తా’. అందరికి తెలిసిన పేరు అయినా వినడానికి వెరైటీగా, కొత్తగా ఉంది కదా. టైటిల్‌ను కూడా వెరైటీగా ఓ వీడియో ద్వారా ప్రకటించాడు విజయ్‌. వీడియోలో పేర్కొన్న ప్రకారం.. తరుణ్ భాస్కర్ గల్లీ క్రికెట్ ఆడుతుంటే.. విజయ్ దేవరకొండ ఫోన్ చేసి.. ఇప్పుడే కథ విన్నాను. ఆ సినిమాకు నేనే నిర్మాతగా ఉండాలనుకొంటున్నాను అంటే.. అందుకు తరుణ్ భాస్కర్ సమాధానం ఇస్తూ.. మంచి సినిమాలు తీయి అంటాడు. సినిమా పేరు ఏంటని అడగ్గా..‘మీకు మాత్రమే చెబుతాను' అని విజయ్ దేవరకొండ అన్నాడు. నాకే చెప్పు.. మరెవరికీ చెప్పను అంటూ తరుణ్ భాస్కర్ అన్నాడు. కాదురా సినిమా టైటిల్ అదే.. ‘మీకు మాత్రమే చెబుతాను'. ఆ సినిమాలో హీరో కూడా నువ్వే అంటూ తరుణ్‌కు ఝలక్‌ ఇచ్చాడు. తాజాగా విడుదలైన ప్రమోషనల్ వీడియో కూడా అదిరిపోయింది. తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, అభినవ్ ఇందులో కనిపించారు. టైటిల్ మీకు మాత్రమే చెప్తా అంటూ విజయ్ చేసిన కామెడీ భలేగా ఉంది. 

సంబంధిత వర్గం
గ్యాప్ 'ఇవ్వలేదు వచ్చింది'  అంటున్న అర్హ....
గ్యాప్ 'ఇవ్వలేదు వచ్చింది' అంటున్న అర్హ....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.