(Local) Sat, 19 Oct, 2019

ఆస్కార్ ఎంట్రీలో డియర్ కామ్రేడ్ ....

September 21, 2019,   8:56 PM IST
Share on:
ఆస్కార్ ఎంట్రీలో డియర్ కామ్రేడ్ ....

విజయ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన రెండవ చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రం విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ విడుదల అయ్యాక సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. నాలుగు భాషల్లోనూ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో విజయ్ దేవరకొండ కాస్త నిరాశకు లోనయ్యాడు. దర్శకుడిగా భరత్ కమ్మకు ఈ చిత్ర తీవ్ర నిరాశకు గురిచేసింది. నిర్మాతలు కూడా నిరుత్సాహ పడ్డారు. అయితే అందరి నిరాశ నిస్పృహలను తుడిచివేస్తూ డియర్ కామ్రేడ్ సినిమా ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. తెలుగు నుంచి ఈ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఏకైక తెలుగు సినిమా డియర్ కామ్రేడ్‌. దీంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. 

ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి తెలుగులో ఈ చిత్రంతో పాటు మరో 28 చిత్రాలు కూడా ఆహ్వానం అందుకున్నాయి. కాగా, ఎంపికైన ఈ చిత్రాలను స్క్రీనింగ్ చేసి అందులోంచి ఓ మంచి సినిమాను జ్యూరీ సభ్యులు ఎంపిక చేస్తారు. దానిని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఆస్కార్‌కి పంపుతారు. ఈ ప్రక్రియ అంతా భారత్‌లోనే జరుగుతుంది. ప్రస్తుతం స్క్రీనింగ్ జరుగుతోంది. ప్రముఖ ఫిల్మ్ మేకర్ అపర్ణ సేన్ అధ్యక్షతన ఈ జ్యూరీ పని చేస్తుంది. చూడాలి మరి ఏ సినిమాకు ఆ వరం దక్కనుందో. 

సంబంధిత వర్గం
చిన్నారి అభిమాని మరణం...ఎమోషనల్ లో బాలకృష్ణ
చిన్నారి అభిమాని మరణం...ఎమోషనల్ లో బాలకృష్ణ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.