(Local) Wed, 02 Dec, 2020

ఓ ఇంటివాడైన హీరో విజయ్ దేవరకొండ ...

November 27, 2019,   5:35 PM IST
Share on:
ఓ ఇంటివాడైన హీరో విజయ్ దేవరకొండ ...

విజయ్ దేవరకొండ ఒకప్పుడు పెద్దగా వినిపించని పేరు....2011 లో నువ్విలా చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన విజయ్ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ కేవలం 2017లో సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఎన్నిసినిమాల్లో నటించినా అర్జున్ రెడ్డి మూవీతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఓ సినిమా నిర్మించాడు. మీకు మాత్రమే చెప్తా అంటూ ఆ మూవీ ప్రమోట్ చేసుకున్నాడు. అయితే ఈ మూవీ అంతగా విజయ్ కి కలిసి రాలేదనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం సినిమాలతో పాటు బిజినెస్ వ్యవహారాల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఈ హీరో ఇంటివాడయ్యాడు. . మొన్న‌టి వ‌ర‌కు శ్రీన‌గ‌ర్ కాల‌నీలో నివ‌సిస్తున్న విజ‌య్ ఫ్యామిలీ రీసెంట్‌గా ఫిలిం న‌గ‌ర్‌లోని శ్రీకాంత్ ఇంటికి స‌మీపంలో ఉన్న కొత్త ఇంటికి షిప్ట్ అయ్యారు. దాదాపు 15 కోట్లు పెట్టి ఈ ఇంటిని కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తుంది. త‌న త‌ల్లిదండ్రులు, సోదరుడితో క‌లిసి విజ‌య్ గృహ‌ప్ర‌వేశం చేశారు. ఈ ఆనందాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.
విజయ్ సినిమాల‌తోనే కాదు బిజినెస్ రంగంలోను రాణిస్తున్నారు. రౌడీ బ్రౌండ్ పేరుతో బ‌ట్ట‌ల వ్యాపారం చేయ‌గా, వీటికి మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఇక ప‌లు బ్రాండ్ల‌కి అంబాసిడ‌ర్‌గా ఉంటూ అడ‌పాద‌డ‌పా ప్ర‌క‌ట‌న‌ల‌లో న‌టిస్తున్న విజ‌య్ లాభాలు బాగానే రాబ‌డుతున్నాడ‌ని చెబుత‌న్నారు. ప్ర‌స్తుతం క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వర్ అనే రొమాంటిక్ డ్రామా చిత్రం చేస్తున్నాడు. తన తొమ్మిద‌వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మిస్తున్నారు.

సంబంధిత వర్గం
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
నిఖిల్‌ కోసం వస్తున్న మెగాస్టార్...
నిఖిల్‌ కోసం వస్తున్న మెగాస్టార్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.