(Local) Mon, 27 Sep, 2021

వరల్డ్ ఫేమస్ కూడా కాపీ...?

September 21, 2019,   9:08 PM IST
Share on:
వరల్డ్ ఫేమస్ కూడా కాపీ...?

ఈ మధ్య టాలీవుడ్ లో కాపీ అనే పదం గట్టిగానే వినిపిస్తుంది. చాలా మంది దర్శకులు కొత్తతనం వైపు అడుగులు వేస్తుంటే మరికొందరు మాత్రం ‘కాపీ’ల బాట పడుతున్నారు. రాజమౌళి అక్కడక్క కొన్ని సీన్స్ కాపీ కొట్టిన ఎవరికీ అర్ధం కాకుండా పూర్తిగా మార్చివేసి తీస్తాడనే పేరు ఉంది. మరికొందరు అయితే కొన్ని సిగ్నేచర్ స్టిల్స్, మరికొన్ని అద్భుతమైన షాట్స్ కాపీ కొట్టేసి తమ సొంత టాలెంట్ అని చెప్పుకుంటారు. ఎవరైనా వాటిని గమనించి ఆధారాలతో బయటపెడితే మేము దానిని అసలు చూడలేదు, దానికి మా దానికి అసలు పోలికే లేదు.. అతను వేసుకున్న చొక్కా చూడు, ఆ చొక్కాకి ఉన్న బటన్స్ చూడు వేరు వేరు అంటూ కవర్ చేస్తుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా “వరల్డ్ ఫేమస్ లవర్” ఫస్ట్ లుక్ వచ్చింది. ఆ లుక్ చాలా వరకు రౌడీ ఫ్యాన్స్ కి నచ్చింది.

అయితే ఆ స్టిల్ కాపీ కొట్టిందని తెలియటానికి పెద్దగా సమయమేమి పట్టలేదు. “చార్లెస్ అజ్నవౌర్ -ల బొహేమి (భౌభౌ రీమిక్స్ )” అంటూ యూట్యూబ్ ఒక సాంగ్ ఉంది. అందులో ఉండే పోస్టర్ లో ఉండే హీరో లుక్ కూడా విజయ్ లుక్ లగే ఉంటుంది. సేమ్ టు సేమ్ అదే ఇంటెన్స్ కనిపిస్తుంది. ఈ సాంగ్ 2018 ఫిబ్రవరి 13 న విడుదల అయ్యింది. దీనిని బట్టి చూస్తే విజయ్ లుక్ కాపీ-పేస్ట్ అని అర్ధం అవుతుంది. వైవిధ్యమైన సినిమాలు తీసే పేరున్న క్రాంతి మాధవ్ ఇలాంటి కాపీ లుక్ ని ఫస్ట్ లుక్ గా ఎందుకు రిలీజ్ చేశాడు. ఇలాంటిది ఒకటి ఉంటుందని ఆయనకి తెలియదా..? లేక కాపీ కొట్టిన ఎవరు కనిపెట్టలేరనే ధీమా తో విడుదల చేశాడా..? పోస్టర్ ఒకరు అయితే అడ్జెస్ట్ కావచ్చు, సినిమా కూడా కాపీ అయితే కష్టమే సుమీ.

సంబంధిత వర్గం
కలెక్షన్ రిపోర్ట్: 'మీకు మాత్రమే చెప్తా'
కలెక్షన్ రిపోర్ట్: 'మీకు మాత్రమే చెప్తా'
ఆస్కార్ ఎంట్రీలో డియర్ కామ్రేడ్ ....
ఆస్కార్ ఎంట్రీలో డియర్ కామ్రేడ్ ....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.