(Local) Fri, 23 Jul, 2021

హౌస్ లో రౌడీ హీరో.....

October 27, 2019,   10:37 PM IST
Share on:
హౌస్ లో రౌడీ హీరో.....

బుల్లితెరపై అందరిని అలరించే గేమ్ షో బిగ్ బాస్....దాదాపు ఏడూ భాషల్లో ప్రసారమయ్యే ఈ బిగ్ బాస్ షో తెలుగు 3 సీజన్ నడుస్తున్న సంగతి. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో చివరిదశకు చేరుతోంది. తాజాగా ఈ గేమ్ షో లో బిగ్ బాస్ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాడు ..  అక్కినేని నాగార్జున రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 3లో దీపావళి సందర్భంగా ఇంట్లోకి వెళ్ళాడు విజయ్. ఈ సందర్భంగా విజయ్ ఇంటి సభ్యులతో కలిసి సరదాగా మాట్లాడాడు. శివజ్యోతి లడ్డుకు లడ్డు అయినవేంది అని అడగడంతో విజయ్ ఆశ్చర్యం వ్యక్తంచేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వదిలింది. ఈ ప్రోమోలో.. ‘నీ పెళ్లి గురించి ప్రతి ఆర్నెల్లకు ఒక రూమర్ వస్తోంది కదా.. దీనిమీద నీ రియాక్షన్ ఏంటీ విజయ్?’ అని నాగార్జున ప్రశ్నించారు. అందుకు విజయ్ నవ్వుతూ.. ‘నా అమల కోసం వెతుకుతున్నా’ అని సమాధానం చెప్పాడు.  దీంతో నాగార్జున నవ్వుతూ.. ‘నీ అమల నీకు దొరకాలని ఆశీర్వదిస్తున్నా’ అంటూ చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ఇదిలావుండగా బిగ్‌బాస్ ఇంట్లోకి ముఖ్య అతిథిగా వెళ్లిన విజయ్ ఇంకా చేసిన సందడి ఏంటో తెలుసుకోవాలంటే ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ కార్యక్రమం చూడాల్సిందే.  ప్రస్తుతం ఇంట్లో బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, శ్రీముఖి, శివజ్యోతి, అలీరెజాలు ఉన్నారు. వీరిలో బాబా భాస్కర్, రాహుల్, శ్రీముఖి ఫైనల్స్‌కు చేరుకున్నారు. 

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
తన లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పిన...ప్రముఖ యాంకర్
తన లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పిన...ప్రముఖ యాంకర్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.