(Local) Sun, 20 Oct, 2019

ఆ తమిళ దర్శకుడు రూమ్ కి రమ్మన్నాడు..... సౌత్ భామ

August 28, 2019,   4:06 PM IST
Share on:
ఆ తమిళ దర్శకుడు రూమ్ కి రమ్మన్నాడు..... సౌత్ భామ

సినీరంగంలో కాస్టింగ్ కౌచ్ పేరిట తెరవెనుక జరిగే కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొంద‌రు న‌టీమ‌ణులు త‌మ‌కి జ‌రిగిన అవాంచ‌నీయ ఘ‌ట‌న‌ల‌ని వివరిస్తూ అల‌జ‌డులు రేపారు. తాజాగా బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ కాస్టింగ్ కౌచ్ విష‌యంలో త‌న‌కి ఎదురైన అనుభ‌వాలు వివ‌రించింది. తాను మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, తన కుటుంబంలో ఎవరూ సినిమా బ్యాక్ గ్రౌండ్ కు సంబంధం ఉన్నవాళ్లు లేరని విద్యాబాలన్ తెలిపింది. 2005లో ప‌రిణీత చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విద్యాబాల‌న్ మాట్లాడుతూ.. నేను ఒక‌రోజు చెన్నైలో ఉన్న‌ట్టు గుర్తుంది.  ఒక సినిమా కాన్సెప్ట్ చెప్పడానికి అంటూ ఒక దర్శకుడు తనవద్దకు వచ్చాడని, కథను వివరించడానికి సమయం కోరాడని చెప్పింది. తను అందుకు ఓకే చెప్పి, కాఫీ షాప్ లో కలుద్దామని చెప్పగా ఆ దర్శకుడు మాత్రం తన రూమ్ కు రావాలని కోరాడని విద్య వివరించింది. అతడి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని తను తలుపు తెరిచి, బయటకు వెళ్లమన్నట్టుగా చూడగా బయటకు వెళ్లిపోయాడని విద్య చెప్పింది. చెన్నైలో తనకు ఈ అనుభవం ఎదురైందని చెప్పిన ఈ నటీమణి ఆ దర్శకుడు ఎవరో చెప్పలేదు.

సంబంధిత వర్గం
'కామసూత్ర' వెబ్‌సిరీస్‌లో పోర్న్ స్టార్....?
'కామసూత్ర' వెబ్‌సిరీస్‌లో పోర్న్ స్టార్....?
“కరిష్మా ఆన్ ఫైర్” అంటూ నెటిజన్స్ కామెంట్స్......
“కరిష్మా ఆన్ ఫైర్” అంటూ నెటిజన్స్ కామెంట్స్......

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.