(Local) Mon, 27 Sep, 2021

వెంకీమామ ఎప్పుడు వస్తున్నాడు ?

October 17, 2019,   1:04 PM IST
Share on:
వెంకీమామ ఎప్పుడు వస్తున్నాడు ?

నిజజీవితంలో కూడా వారు మామ,అల్లులు అయిన విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య త్వరలో తెరమీద అల్లుళ్లుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి హీరోస్ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా  బాబీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ  మల్టీస్టారర్ కాంబోలో ఫుల్ లెన్త్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ‘వెంకిమామ’ లో పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది అనే అంశం ఇంకా తెలియడంలేదు. అయితే ఈ వెంకిమామ రిలీజ్ కోసం ఇతర సినిమాల హీరోలు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ క్రిష్ట్మస్ కి వెంకిమామ డేట్ ఇస్తారేమో అని అప్పుడు విడుదల కాబోతున్న డిస్కో రాజా, భీష్మ, ప్రతిరోజూ పండగే హీరోలు కంగారు పడుతున్నారు. తూచ్ వెంకిమామ సంక్రాంతికే రిలీజ్ అంటూ.. అప్పుడు విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా సినిమా హీరోలు కంగారు పడేలా ప్రచారం జరుగుతుంది. అయినా వెంకిమామ మీద ఉన్న అంచనాలు చూస్తే ఈ సినిమాకి సోలో డేట్ దొరికితే సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయంటున్నారు. కానీ వెంకిమామ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తయ్యి… ప్రమోషన్స్ చేసుకుని బరిలో నిలుస్తుందో అని అక్కినేని, దగ్గుబాటి అభిమానులే కాదు… ఇతర సినిమా దర్శకనిర్మాత హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత వర్గం
లేడీ సూపర్ స్టార్ ఎలా మారిందో చూసారా...?
లేడీ సూపర్ స్టార్ ఎలా మారిందో చూసారా...?

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.