(Local) Wed, 20 Oct, 2021

23న వస్తున్న కెప్టెన్ కార్తీక్....వెంకీ మామ

November 21, 2019,   11:24 PM IST
Share on:
23న వస్తున్న కెప్టెన్ కార్తీక్....వెంకీ మామ

రియల్ లైఫ్ మామ అల్లుడు రీల్ లైఫ్ లో కలిసి వెండితెరపై కనువిందు చేయబోతున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వెంకీ మామ'. ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతు సరసన రాశీఖన్నా జంటగా నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ మరియు పాటలకు మంచి స్పందన వస్తోంది. గురువారం మధ్యాహ్నం, శనివారం సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ఈ సినిమాలో చైతు మిలటరీ సోల్జర్‌‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే.. ‘కెప్టెన్ కార్తీక్ నవంబర్ 23న మిమ్మల్ని కలవబోతున్నాడు’ అంటూ అప్‌డేట్ ఇచ్చారు. దీని బట్టి చైతు న్యూ పోస్టర్ కానీ, న్యూ టీజర్ కానీ విడుదల చేయనున్నారని అర్ధమవుతోంది.

సంబంధిత వర్గం
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.