(Local) Sat, 23 Jan, 2021

తెరమీద మళ్ళీ కనువిందు చేయనున్న బిందెల సాంగ్.....

September 17, 2019,   12:29 PM IST
Share on:
తెరమీద మళ్ళీ కనువిందు చేయనున్న బిందెల సాంగ్.....

1982లో  సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం దేవత. ఈ చిత్రంలో  ఇందులో శ్రీదేవి, శోభ‌న్ బాబు మ‌ధ్య వచ్చే ఎల్లువొచ్చి గోదారమ్మ..ఎల్లకిల్లా పడ్డాదమ్మో’...ఈ పాట గుర్తుందా...అప్పట్లో ఈ సాంగ్ ఎంత పాపుల‌ర్ అయిందే ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు.  గోదారి అందాల నడుమ ఇసుక తిన్నెలపై సాగే ఈ పాట కేవలం గోదావరి అందాలు మాత్రమే కాదు... తళతళలాడే వందల ఇత్తడి బిందెల మధ్య నాయకానాయికలు స్టెప్పులేస్తుంటే అభిమానుల హృదయాలు పులకించిపోయాయి. అయితే ఇప్పుడు ఈ పాటను మళ్ళీ వెండితెరపై చూడబోతున్నాం. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాల్మీకి’ చిత్రంలో ఈ పాటను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పూజా హెగ్డే మధ్య ఈ సాంగ్‌ను తెరకెక్కించారు. అయితే అప్పట్లో ఓ రేంజ్ లో హిట్ ని సొంతం చేసుకున్న ఈ పాటని రీమిక్స్ చేయాలి అంటే అందుకు ఎంతో కష్టపడవలసి ఉంటుంది. 
తాజాగా వాల్మీకి చిత్ర బృందం ఈ సాంగ్ మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేసింది. ఒరిజనల్ పాటకు ఏ మాత్రం తీసిపోకుండా.. ఈ పాట ఉండబోతున్నట్లు అందులో స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ పాటలో పూజా హెగ్డే కూడా తన అందాలతో అదరగొడుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో ఆకట్టుకున్న వాల్మీకిపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. రిమేక్ సాంగ్‌తో అభిమానుల అంచనాలు మరింత పెంచేశాయి. మరి ఆనాటి సాంగ్ షూటింగ్‌లో ఈ సరికొత్త జోడి ఎలా మెప్పించబోతున్నారనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.