(Local) Wed, 21 Aug, 2019

స్వాతంత్ర దినోత్సవం నాడు వాల్మీకి టీజర్...

August 13, 2019,   12:26 PM IST
Share on:

మెగా హీరో వ‌రుణ్ తేజ్ సినీ కెరీర్ స్టార్టింగ్ నుండి భిన్న కథాంశంతో కూడిన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షుకుల దగ్గరవుతున్నారు. ఆ మధ్య విక్టరీ వెంకటేష్ తో మల్టీస్టారర్ చిత్రం 'ఫ్2' లో నటించి అందరిని నవ్వించాడు. తాజాగా వ‌రుణ్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వాల్మీకి అనే చిత్రంతో రౌడీ షీటర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోలీవుడ్ సూప‌ర్ హిట్ జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా తెర‌కెక్కుతుంది. ఇప్ప‌టికే చిత్రంలో వ‌రుణ్ లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల కాగా, ఇది ఫ్యాన్స్‌లో సినిమాపై ఆస‌క్తిని క‌లిగించింది. తాజాగా ఆగ‌స్ట్ 15న‌ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు మేక‌ర్స్. ఇందులో వ‌రుణ్ లుక్స్ చూస్తుంటే సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంద‌నే అభిప్రాయానికి వ‌స్తున్నారు అభిమానులు. మాస్ ప్రేక్ష‌కుల‌కి ఈ చిత్రాన్ని మ‌రింత ద‌గ్గ‌ర‌గా చేర్చేందుకు ఇందులో ఒక ఐట‌మ్ సాంగ్‌ని కూడా పెడుతున్నారు. ఈ ఐట‌మ్ సాంగ్‌లో డింపుల్ హ‌యాతి అనే తెలుగ‌మ్మాయి త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌నుంద‌ట‌. ఈ అమ్మాయి ప్రభుదేవ, తమన్నాలు నటించిన ‘దేవి-2’లో కీల‌క పాత్ర పోషించింది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాల్మీకి  చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు చిత్ర యూనిట్.  

సంబంధిత వర్గం

2 మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న వాల్మీకి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.