(Local) Sun, 16 Feb, 2020

పవర్ కళ్యాణ్ బర్త్ డేకి ‘వాల్మీకి’ టీమ్ సర్ ప్రైజ్…

September 02, 2019,   4:24 PM IST
Share on:
పవర్ కళ్యాణ్ బర్త్ డేకి ‘వాల్మీకి’ టీమ్ సర్ ప్రైజ్ ...

మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు, వినాయక చవితి సందర్భంగా మెగా అభిమానులకు వరుణ్ తేజ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘వాల్మీకి’కి సంబంధించిన కొత్త పోస్టర్లను ట్వీట్టర్ ద్వారా విడుదల చేశాడు. ఈ పోస్టర్లలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ రెండు పోస్టర్లు మెగాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో నెగెటీవ్ పాత్రలో నటిస్తున్న వరుణ్ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమిళ నటుడు అధర్వ మురళి, మృణాళిని రవి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సినిమా, తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్ గా తెరకెక్కుతోంది.

సంబంధిత వర్గం
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.