(Local) Mon, 23 Nov, 2020

2 మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న వాల్మీకి

August 16, 2019,   11:28 AM IST
Share on:
2 మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న వాల్మీకి

ఆగష్టు 14న సైరా టీమ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ సైరా నరసింహారెడ్డి మేకింగ్ వీడియో విడుదల చేసి మెగా అభిమానులకి ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. అదే కోవలో ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా ఫ్యామిలీ నుండి మెగా ప్రిన్స్ నటిస్తున్న వాల్మీకి  టీజర్ విడుదలయింది.  తమిళ జిగర్తాండ చిత్రానికి తెలుగు రీమేక్ చేసి తెలుగులో హారీష్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' గా తెరకెక్కించిన సంగతి విదితమే. ఈ మూవీని 14 రీల్స్ పతాకంపై ఆచంట రామ్, గోపిలు నిర్మిస్తున్నారు..

తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అప్పుడే 2 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్ళిపోతోంది... ఫుల్ మాస్ లుక్ లో వరుణ్ తేజ్ అదరగొట్టాడు.. అలాగే డైలాగ్ డెలివరీలో తెలంగాణా మాండలికాన్ని ఉపయోగించారు.. ‘నా సినిమాలో విలనే నా హీరో’ అంటూ అధర్వ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ స్టార్ట్‌ అవుతుంది. వరుణ్‌ స్టైలిష్‌ లుక్‌తో గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నాడు. సిగరెట్‌ తాగుతూ వరుణ్‌ నడుస్తూ వచ్చే సీన్‌ బాగుంది. టీజర్‌ చూస్తుంటే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఈ సినిమాకు హైలెట్‌గా నిలువనున్నాయని తెలుస్తుంది. ‘అందుకే పెద్దోళ్ళు చెప్పిండ్రు.. నాలుగు బుల్లెట్స్‌ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె, రెండు దాచుకోవాలె’ అని వరుణ్‌ తేజ్‌ ఇంటెన్స్‌ లుక్‌ చెప్పే డైలాగ్‌తో 51 సెకండ్ల నిడివిగల టీజర్‌ ముగుస్తుంది. టీజర్‌ చూస్తుంటే సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అనే ఇంట్రెస్ట్‌ క్రేయేట్‌ చేశారు దర్శకుడు.  ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సెప్టెంబర్‌ 13న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నారు.
 

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.