(Local) Sat, 23 Jan, 2021

వాల్మీకి జ్యూక్ బాక్స్ విడుదలైయింది....

September 18, 2019,   3:13 PM IST
Share on:
వాల్మీకి జ్యూక్ బాక్స్ విడుదలైయింది....

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన చిత్రం "వాల్మీకి". హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ హీరోగా, అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏఈ నెల 20న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రయూనిట్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో ఈ మూవీ పై మెగా అభిమానుల అంచనాలు మరింత ఎక్కువయినా సంగతి తెలిసిందే. యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ 'వాల్మీకి' మూవీలోని పాటలు మరింత ఈ సినినిమాకి మరింత క్రేజ్ ని సంపాదించి పెట్టింది. అయితే ఈ చిత్రంలో అలనాటి నటులు శోభన్ బాబు, శ్రీదేవి నటించిన 'దేవాత' చిత్రంలోని 'ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో' పాటను రీమేక్ చేయగా ఈ సాంగ్ ప్రోమోను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా రీసెంట్‌గా వాల్మీకి మూవీ నుండి జ్యూక్‌బాక్స్ రిలీజ్ అయ్యింది. రీమిక్ సాంగ్ మినహా మూడు పాటలున్నాయి ఈ ఆల్బమ్‌లో....'జర్రా జర్రా' పాటను భాస్కరభట్ల, 'గగన వీధిలో' పాటను వనమాలి, 'వాకా వాకా' పాటను చంద్రబోస్ చాలా బాగా రాయగా, అనురాగ్ కులకర్ణి, ఉమానేహా, శ్వేతా సుబ్రమణియన్ అంతే బాగా పాడారు. తమిళ యంగ్ హీరో అధర్వ కీలక పాత్రలో నటించారు. అంతేకాక ఈ చిత్రంలో ఓ గెస్ట్ పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కూడా కనిపించనున్నారు. 

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.