(Local) Sat, 27 Feb, 2021

తండ్రి బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసిన వరుణ్, నిహారిక

October 30, 2019,   3:47 PM IST
Share on:
తండ్రి బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసిన వరుణ్, నిహ ...

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మాత్రమే కాకుండా నాగ బాబు నటుడిగా, ప్రొడ్యూసర్ గా మంచి పేరు సంపాదించారు. నిర్మాతగా  అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నాగబాబు నిన్న తన 58వ జన్మదినాన్ని కుటుంబసభ్యుల మధ్య ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం తన తండ్రి నాగబాబు పుట్టినరోజును పురష్కరించుకుని ట్విట్టర్ ద్వారా వరుణ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నీ ముఖంలో చిరునవ్వు కోసం నేను ఏమైనా చేస్తాను. నాకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన నీకు కృతజ్ఞతలు. నీకన్నా ఇష్టమైనది నాకు ఏమీ లేదు’’ అని వరుణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, నిహారిక కూడా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి నుదిటిపై ప్రేమగా ముద్దుపెడుతున్న ఫొటోను కూడా ట్వీట్ చేశారు.

సంబంధిత వర్గం
రొమాంటిక్ హీరోకి భార్యగా రమ్యకృష్ణ...
రొమాంటిక్ హీరోకి భార్యగా రమ్యకృష్ణ...
వాళ్లతో నేను సినిమా తీయట్లేదు...వర్మ
వాళ్లతో నేను సినిమా తీయట్లేదు...వర్మ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.