(Local) Wed, 21 Apr, 2021

వాల్మీకి కి మరో సమస్య...

October 05, 2019,   2:52 PM IST
Share on:
వాల్మీకి కి మరో సమస్య...

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గద్దలకొండ గణేష్'. అయితే ఈ మూవీకి మొదట వాల్మీకి అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. అనుకోని కారణాల వల్ల చివరిగా వాల్మీకి కాస్త గద్దలకొండ గణేష్ గా మార్చి విడుదల చేసారు. హరీష్ - వరుణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తో మంచి వసూళ్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా హిందీ డబ్బింగ్ విషయంలో కోటిన్నర రూపాయలు కొనుగోలుదారుల నుంచి ఏదో నిబంధన ఉల్లంఘన నోటీసు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో మన మేకర్స్ యాభై లక్షలు ఇస్తాం అని చెబుతున్నారు కానీ వాళ్ళు ససేమీరా అంటున్నారు అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న భారీ సినిమాలు 'సరిలేరు నీకెవ్వరూ', అలా వైకుంఠపురంలో' సినిమాల హిందీ డబ్బింగ్ అమ్మకాలు నిలిచిపోయాయి. బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు సినిమాలని డైరెక్ట్ గా కొన్ని డబ్ చేయరు. మధ్యవర్తుల దగ్గరే కొంటున్నాయి అక్కడ సంస్థలు. వాళ్లేమో రింగ్ కావడంతో తెలుగు సినిమాల హిందీ అమ్మకాలకు గ్రహణం పట్టేటట్లే కనిపిస్తోంది.

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.