(Local) Sat, 19 Oct, 2019

హౌస్ లోకి ‘గద్దలకొండ గణేష్’....

September 22, 2019,   7:17 PM IST
Share on:
హౌస్ లోకి ‘గద్దలకొండ గణేష్’....

బిగ్ బాస్ షో కేవలం ఒక రియాలిటీ షో మాత్రమే కాదు...బుల్లితెరపై కొత్త సినిమా ప్రమేషన్స్ కి సహకరించే ఒక షో అనడంలో ఏ మాత్రం సందేహం లేదు...తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజ హెగ్డే నటించిన తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ ఈవారం బిగ్ బాస్ హౌజ్‌కు అతిథిగా వచ్చాడు. హౌజ్‌లో కాసేపు సరదాగా గడిపాడు. గద్దలకొండ గణేష్‌’గా వచ్చాడు కాబట్టి తెలంగాణ యాసలోనే మాట్లాడాడు. వరుణ్ వచ్చాక నాగార్జున కూడా మాస్ హీరోగా మారి విజిల్స్ వేస్తూ సందడి చేశారు. ఇక ఇంట్లో ఉన్న హౌజ్ మేట్స్ కూడా గద్దలకొండ గణేష్ రాకతో మాస్ అయిపోయారు. సూపర్ హిట్టు నీ హైట్ అంటూ రచ్చ రచ్చ చేసారు. మరోవైపు శ్రీముఖి, హిమజ మన గద్దలకొండ గణేష్‌కు ప్రపోజ్ చేయడం గమనార్హం. ఈ ఎపిసోడ్‌కి సంబందించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈరోజు రాత్రి ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది..
 

సంబంధిత వర్గం
బాహుబలి సీన్ కాస్తా రివర్స్ అయింది...
బాహుబలి సీన్ కాస్తా రివర్స్ అయింది...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.