(Local) Sun, 20 Jun, 2021

మట్టిలో ఉక్కు మనిషి.. రెండోసారి కెప్టెన్ అయిన వరుణ్

August 31, 2019,   5:41 PM IST
Share on:
మట్టిలో ఉక్కు మనిషి.. రెండోసారి కెప్టెన్ అయిన వరుణ ...

బిగ్ బాస్ 5 వారం చివరికి చేరుకుంది. వారం చివరలో కెప్టెన్ టాస్క్ లో నెగ్గి తదుపరి వారం ఎలిమినేషన్ నుండి బయటపడేందుకు తాపత్రయం పడుతున్నారు ఇంటి సభ్యులు. అయితే ఈ వారం ఆ అవకాశం బాబా బాస్కర్ , రాహుల్ సిఫ్లిగంజ్, వరుణ్ సందేశ్ లకు లభించింది. అయితే ఈ టాస్క్ లో తన సత్తా చాటి రెండవ సారి బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్ గా నిలిచాడు వరుణ్ సందేశం. కెప్టెన్ గా గెలిచేందుకు ‘మట్టిలో ఉక్కు మనిషి’ టాస్క్ ను ఆ ముగ్గురికి ఇచ్చాడు బిగ్ బాస్. మట్టిలోని బంతులను వారివారికి ఇచ్చిన బాస్కెట్ లో వేయాలని ఎవరు ఎక్కువ బంతులు బాస్కెట్ లో వేస్తే వారే టీం లీడర్ అని ప్రకటించాడు. ఈ టాస్క్‌కు సంచాలకులుగా హిమజను నియమించారు బిగ్ బాస్. ఈ మట్టిలో కొట్లాటలో వరుణ్ సందేశ్ గెలుపొందారు. బాబా భాస్కర్, రాహుల్ కంటే ఎక్కువ బాల్స్‌ను వెతికి బాస్కెట్‌లో వరుణ్ వేయడంతో అతన్ని బిగ్ బాస్ హౌస్‌‌కి రెండోసారి కెప్టెన్ గా ఎన్నిక అయినట్టు ప్రకటించాడు బిగ్ బాస్. ఇక ఆ తరువాతే లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా ‘రంగుపడుద్ది’ అనే టాస్క్ ను ఇంటి సభ్యులకు ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న వరుణ్ రోప్‌కి కట్టేసి రంగుబాల్స్‌‌తో కొట్టమని.. అలా కొట్టిన బాల్ వెళ్లి ఏ ఐటమ్‌కి తగిలితే ఆ ఐటమ్ లగ్జరీ బడ్జెట్‌గా వస్తుందని బిగ్ బాస్ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో వరుణ్‌ని బాల్స్‌తో వీరబాదుడు బాదారు కంటెస్టెంట్స్.

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.