(Local) Sun, 20 Jun, 2021

మాస్ మహారాజ్ తో వరలక్ష్మీ.....

November 10, 2019,   7:50 PM IST
Share on:
మాస్ మహారాజ్ తో వరలక్ష్మీ.....

మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హీరోగా రవితేజకిది 66వ సినిమా.. ‘డాన్ శీను’, ‘బలుపు’ తర్వాత గోపిచంద్ మలినేని రవితేజతో హ్యాట్రిక్ హిట్‌కి రెడీ అయ్యాడు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటించనుండగా.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ ప్రాజెక్ట్‌లోకి వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఎంటరైంది. ‘పందెంకోడి 2’, ‘సర్కార్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్.. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘తెనాలి రామకృష్ణ BA.BL’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచమవుతుంది. నవంబర్ 15న ఈ సినిమా విడుదల కానుంది.
రవితేజ 66లో ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం వరూని సెలెక్ట్ చేసినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. రవితేజ నటిస్తున్న ‘డిస్కోరాజా’ 2020 జనవరి 24న విడుదల కానుంది.

సంబంధిత వర్గం
వరలక్ష్మి పాత్ర కూడా తేలిపోయింది...
వరలక్ష్మి పాత్ర కూడా తేలిపోయింది...
ర‌వితేజ‌ రీమేక్ లో విలక్షణ నటుడు....
ర‌వితేజ‌ రీమేక్ లో విలక్షణ నటుడు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.