(Local) Wed, 24 Jul, 2019

`వంగ‌వీటి` లుక్ లో సురేష్ కొండేటి ఫస్ట్ లుక్

July 03, 2019,   6:33 PM IST
Share on:

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోను  పొలిటిషన్, కొందరి నాయకుల లాంటి రియల్ స్టోరీస్ అయితే ఎక్కవ ఇంట్రెస్ట్ తో ఆదరిస్తారు. ఒక కులం అండ‌తో నాయ‌కుడైనా .. ప్ర‌త్య‌ర్థి సామాజిక వ‌ర్గం యువ‌తిని పెళ్లాడి.. ప్ర‌త్య‌ర్థి కులాల పేద‌ల్ని ఆదుకుని.. ఏ ఒక్క కులానికో ప‌రిమితం కాని నాయ‌కుడ‌య్యాడు వంగ‌వీటి రంగా. పేద‌- బ‌డుగు-బ‌ల‌హీన వ‌ర్గాల ఆరాధ్య దైవంగా అవ‌త‌రించాడు. వంగ‌వీటి రంగాకు ధీటైన వ‌ర్గంగా బెజ‌వాడ రాజ‌కీయాల్లో ఎదిగిన దేవినేని నెహ్రూ సోద‌రుల‌ ప్ర‌స్థానం అంతే గొప్ప‌ది. రంగా – నెహ్రూల మ‌ధ్య స్నేహం స్థానంలో శ‌త్రుత్వం పెర‌గడానికి ర‌క‌ర‌కాల కార‌ణాలు ఉన్నాయి. 
ఇప్పుడు ఆ ఇద్ద‌రి క‌థ‌తోనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి `దేవినేని` అనే టైటిల్ ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. `బెజవాడ సింహం` అనేది ఉప‌శీర్షిక‌. శివ‌నాగు ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌టి‌ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. దేవినేని నెహ్రూగా టైటిల్ పాత్ర‌లో నందమూరి తారకరత్న నటిస్తుండగా ..వంగవీటి రంగా పాాత్రలో ప్రముఖ పత్రికాధిపతి, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి (సంతోషం సురేష్) నటిస్తున్నారు. నేడు వంగ‌వీటి రంగా 72వ జ‌యంతి సంద‌ర్భంగా రంగా పాత్ర‌ధారి ఫ‌స్ట్ లుక్ ని చిత్ర‌యూనిట్ లాంచ్ చేసింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శివ‌నాగు మాట్లాడుతూ.. బెజవాడలో జరిగిన ఇద్దరు మహానాయకుల మధ్య జరిగిన యదార్థ కథను కళ్ళకు కట్టినట్టు తెరకెక్కిస్తున్నామ‌ని తెలిపారు.“దేవినేని – రంగా పాత్ర‌లు ఒక‌దానితో ఒక‌టి పోటాపోటీగా ఉంటాయి. ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ చిత్రీకరిస్తున్న ఈ చిత్రం చాలా నేచురల్‌గా వుంటుంది. తాజాగా వంగ‌వీటి రంగా పాత్ర ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నాం. రంగా పాత్ర‌లో సురేష్ కొండేటి న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. దేవినేని పాత్ర‌లో తార‌కర‌త్న అంతే అద్భుతంగా న‌టించారు“ అని తెలిపారు

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.