(Local) Sat, 23 Jan, 2021

'వాల్మీకి' ట్రైలర్‌ వచ్చేసింది...వరుణ్ 'చింపేశాడు పో..!'

September 09, 2019,   5:32 PM IST
Share on:
'వాల్మీకి' ట్రైలర్‌ వచ్చేసింది...వరుణ్ 'చింపేశాడు  ...

కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ చాల సున్నితంగా కనిపించే క్యారెక్టర్ తో కూడిన సినిమాలను చేస్తూ వచ్చిన మెగాప్రిన్స్ వరుణ్ తేజ. ఈసారి మాత్రం అభిమానుల దెగ్గర నుండి చూసే ప్రతి ప్రేక్షకుడిని వరకు ఇది హీరో వరుణ్ నే అనిపించే అంత విభిన్న పాత్రలో కనిపించబోతున్నాడు మెగా హీరో. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న చిత్రం 'వాల్మీకి'. తమిళ చిత్రం ‘జిగర్తాండ’ మూవీకి రీమేక్ చేసి తెలుగులో వాల్మీకి తెరకెక్కించాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రీ టీజర్, టీజర్‌లు విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.ఇక ఇప్పుడు ట్రైలర్ అయితే మరో స్థాయిలో ఉంది. ముఖ్యంగా డైలాగ్ డెలవరీలో కూడా పిచ్చెక్కించాడు వరుణ్ తేజ్. ఫామ్ హౌస్‌లో ఉన్న డాన్‌కి కాదు.. ఫామ్‌లో ఉన్న డాన్‌ని పట్టుకునే కథే ఈ వాల్మీకి. ఓ మంచి సినిమా తీయాలనుకునే యువ దర్శకుడు ‘వాల్మీకి’ని ఎలా చూపించాడన్నదే ఈ సినిమా నేపథ్యం. ‘నాపైన పందేలు వేస్తే గెలుస్తారు.. నాతోటి పందేలేస్తే చస్తరు.. గద్దల కొండ గణేష్‌ అంటే గజ గజ గజ వణకాలి అంటూ తెలంగాణ యాసలో చెప్తున్న డైలాగ్‌ అతని పాత్రకు యాప్ట్ అయ్యేట్టుగా ఉంది. ఏమ్ రోయ్.. మనం బతుకున్నమని పదిమందికి తెల్వకపోతే.. మనం బతుకుడెందుకురా? అని క్రూరంగా నవ్వుతూ వరుణ్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కి హైలైట్‌గా ఉంది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ మంచి కసితో తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ట్రైలర్ లో అడుగడుగునా ఆ కసి కనిపిస్తుంది. మరి ఈ చిత్రంతో వరుణ్ తేజ్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.సెప్టెంబరు 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.