(Local) Sun, 17 Jan, 2021

వాల్మీకి చిత్రానికి బీజేపీ అధ్యక్షుడి వార్నింగ్...

September 17, 2019,   1:16 PM IST
Share on:
వాల్మీకి చిత్రానికి బీజేపీ అధ్యక్షుడి వార్నింగ్...

ఈ మధ్య చిత్రసీమలో ఏదైనా సినిమా తీయాలి అంటే కథతో మొదలుకొని టైటిల్ వరకు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజాగా  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మూవీ టైటిల్ పై పలు వివాదాలు తీరుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజ హెగ్డే హీరోహీరోయిన్లు గా తెరకెక్కుతున్న చిత్రం "వాల్మీకి".  ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. అయితే ఈ మూవీ మొదలైయినప్పటి నుండి కూడా కొన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కాగా ఈ వాల్మీకి చిత్ర టైటిల్ పలు వివాదాలకు దారి తీస్తుంది. ఈ టైటిల్ బోయ కులస్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, కాగా తక్షణమే ఆ చిత్ర టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఒక గ్యాంగ్‌స్టర్ ఒక్కసారిగా ఎలా మంచివాడిగా మారాడు అనేది కథ. కాగా అందుకోసమనే ఈ చిత్రానికి వాల్మీకి అనే టైటిల్ పెట్టమని చెబుతున్నారు. కాగా ఈ చిత్రంలో ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా సన్నివేశాలు ఉంటాయని, ఎవరికీ ఎలాంటి సమస్యలు రావని, ఎట్టి పరిస్థితిలో ఈ మూవీ టైటిల్ మార్చబోయేది లేదని దర్శకుడు హరీష్ శంకర్ చెప్పారు. కాగా తాజాగా ఈ గొడవలోకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఎంటర్ అయ్యాడు. అయితే బోయ సంఘం వారు లక్ష్మణ్ కి ఈ వివాదం కోసం ఫిర్యాదు చేయగా ఆయన కూడా వారికే మద్దతు తెలిపారు. ఇకపోతే ఒక గ్యాంగ్‌స్టర్ సినిమాకి ఇలా వాల్మీకి పేరు పెట్టడం చాలా తప్పని, ఈ విషయం మీద సెన్సార్ బోర్డు కి ఫిర్యాదు చేశామని చెప్పారు. అంతేకాకుండా ఈ చిత్ర టైటిల్ మార్చకపోతే బోయవాళ్ళందరూ కూడా ఏకం అయి నిరసనలు తెలుపుతారని, ఆ తరువాత జరిగే పరిణామాలకు చిత్ర బృందమే పూర్తీ బాధ్యత వహించాలని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు.
 

సంబంధిత వర్గం
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్‌

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.