(Local) Sat, 24 Jul, 2021

భార్య ట్వీట్ కి స్పందించిన మెగాహీరో....

October 27, 2019,   10:52 PM IST
Share on:
భార్య ట్వీట్ కి స్పందించిన మెగాహీరో....

మెగా కోడలైన రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. తాజాగా ఉపాసన కొణిదెల మోడీ ని టాగ్ చేస్తూ చేసిన ఓ ట్వీట్ సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేయసాగింది. ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌ను నిర్ల‌క్ష్యం చేయొద్దంటూ ప్రధాని మోదీకి హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్వీట్ చేసింది.  గాంధీజీ 150వ జ‌యంతి సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవ‌ల ఉత్త‌రాది న‌టీన‌టుల‌తో ఓ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. దీనికి దక్షిణాదివారిని మాత్రమే ఆహ్వానించడంపై ఉపాసన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అయింది.అయితే ఈ ట్వీట్ గురించి తాజాగా రామ్‌చ‌ర‌ణ్‌ను అడిగితే ‘ప్ర‌ధాని మోదీగారిని ఉపాసన ఎక్క‌డా విమ‌ర్శించ‌లేదు. గౌర‌వంగా త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది. దానిని ఖుష్బూగారు మ‌రో స్థాయికి తీసుకెళ్లారు. నిజానికి ఉపాస‌న ట్వీట్ గురించి నాకు ఎప్ప‌టికో తెలిసింది. దీనిపై త‌న‌ని అడ‌గ్గా.. మోదీకి ట్వీట్ చేస్తున్న‌ట్లు చెబితే నువ్వు వ‌ద్దంటావ‌ని చెప్ప‌కుండా చేశాను అంది. వాస్తవానికి ఇటువంటి విషయాలపై మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మాట్లాడితే బాగుండేది’ అని చరణ్ తెలిపాడు.

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
‘మోదీ' ని టార్గెట్ చేసిన ఉపాసన రామ్ చరణ్..
‘మోదీ' ని టార్గెట్ చేసిన ఉపాసన రామ్ చరణ్..

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.