(Local) Wed, 02 Dec, 2020

‘మోదీ' ని టార్గెట్ చేసిన ఉపాసన రామ్ చరణ్..

October 21, 2019,   1:36 PM IST
Share on:
‘మోదీ' ని టార్గెట్ చేసిన ఉపాసన రామ్ చరణ్..

మహాత్మ గాంధీ 150వ గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా సింగిల్ టైం యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఒకటి. ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఈ సందర్బంగా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందు కోసం సినిమా పరిశ్రమను ఎంచుకుంది. సినిమా నటీనటులకు కోట్లలో అభిమానులు ఉంటారు. వారు ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం చేస్తే ప్రజల్లోకి త్వరలో వెళుతుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఇటీవల బాలీవుడ్ సెలెబ్రిటీలతో ప్రధాని మోదీ ఓ సమావేశం ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ గురించి ఆయన కల గురించి మోదీజీ వారితో చర్చించారు. ప్లాస్టిక్ నిషేధం గురించి వారికి వివరించాడు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం చేయాలని కోరాడు.

అయితే ఈ కార్య‌క్ర‌మాల గురించి చ‌ర్చించ‌డానికి ప్ర‌ధాని మోదీ బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ క‌పూర్‌, ర‌కుల్‌ల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌ని త‌న ఇంటికి ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. అయితే ద‌క్షిణాది నుండి దిల్ రాజు మిన‌హా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమల నుండి ఏ సెలబ్రిటీకి ఆహ్వానం అందలేదు. దీనిపై రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా మోదీని ప్ర‌శ్నించింది. ఆ ట్వీట్ లో "ద‌క్షిణాదిన మీరంటే మాకు ఎంతో గౌర‌వం. మీరు ప్ర‌ధానిగా ఉండ‌టం ప‌ట్ల మేము గ‌ర్విస్తున్నాయి. గొప్ప కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ప్పుడు వాటిలో హిందీ ఆర్టిస్టుల‌నే ఎక్కువ భాగం ప‌రిమితం చేస్తున్నారు. ద‌క్షిణాది న‌టుల‌ని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. చాలా బాధ‌తో నా మ‌న‌సులో భావాన్ని మీకు వ్య‌క్త‌ప‌రుస్తున్నాను అని ఉపాస‌న.. మోదీకి ట్వీట్ చేసింది.

సంబంధిత వర్గం
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.