(Local) Mon, 27 Sep, 2021

సైరా 'లక్ష్మి'కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌...

October 06, 2019,   10:31 PM IST
Share on:
సైరా 'లక్ష్మి'కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌...

మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మూవీ 'సైరా నరసింహ రెడ్డి'. అక్టోబర్ 2న గాంధీ జ‌యంతి సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా అయిదు భాషల్లో సైరా విడుదలై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ళు రాబ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చారిత్రాత్మ‌క సైరా చిత్రం విజయంతో మెగా ఫాన్స్ సంబరాలు చేసుకోవడమే కాకుండా మెగా ఫ్యామిలీ కూడా విజ‌యాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సైరా చిత్ర నిర్మాత  రామ్ చరణ్ భార్య ఉపాస‌న కొణిదెల కూడా సైరా విజ‌యాన్ని ఆస్వాదిస్తూ చిత్రంలో ల‌క్ష్మీ న‌ర‌సింహారెడ్డి పాత్ర పోషించిన త‌మ‌న్నాకి స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చింది. ఖ‌రీదైన క్రిస్టల్ రింగ్ త‌మ‌న్నాకి బ‌హుమ‌తిగా ఇచ్చిన ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఉంగ‌రంతో త‌మ‌న్నా దిగిన ఫోటోని షేర్ చేస్తూ .. `నిర్మాత భార్య నుంచి సూపర్ తమన్నాకు ఓ బహుమతి. నిన్ను మిస్ అవుతున్నాను. త్వరలో కలుద్దాం` అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. న‌ర్సింహారెడ్డి ప్రియురాలిగా, న‌ర్త‌కిగా త‌మన్నా త‌న పాత్ర‌లో జీవించింది. ఆమె పాత్ర‌పై ప్ర‌శంసల వ‌ర్షం కురుస్తుంది.

సంబంధిత వర్గం
వెబ్ సిరీస్‌లో నటించనున్న  తమన్నా
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.