(Local) Tue, 02 Mar, 2021

అలా వైకుంఠపురములో పూజ జబ్బేమిటో...

October 21, 2019,   3:27 PM IST
Share on:
అలా వైకుంఠపురములో పూజ జబ్బేమిటో...

టాలీవుడ్ దర్శకులలో మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే ప్రేక్షుకులు ఎదో ఒక కొత్తదనాన్ని ఆశిస్తారని తెలిసిందే. అంతేకాక త్రివిక్రమ్ సినిమాల్లో ఆయన వ్రాసే డైలాగ్స్ ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అయితే త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీ పంచ్ లతో పాటుగా.. హీరోయిన్స్ కి ఏదో ఒక వీక్ నెస్(లోపం) ఉండడం గమనిస్తూనే ఉన్నాం. జల్సా సినిమాలో ఇలియానా ని... ఇక జులాయి సినిమాలోనూ ఇలియానా కి తింగరి తనం ఎక్కువ, తెలివితేటలు తక్కువ. అంతేనా సన్నాఫ్ కృష్ణమూర్తి లోను సమంత ని హాట్ గా గ్లామర్ గా చూపిస్తూనే ఆమెకి డయాబెటిస్ వ్యాధి ఉందని అందుకే చక్లెట్స్ తింటూ అమాయకంగా ఉండేలా చూపించాడు. ఇక త్రివిక్రమ్ మొదటి డిజాస్టర్ అజ్ఞాతవాసి సినిమాలో హీరోయిన్స్ కీర్తి సురేష్, అను ఇమ్మన్యువల్ కి అసలు మెదడు ఉందో.. లేదో.. అనే డౌట్ కొట్టే తెలివితేటలు ఉంటాయి. అలా వైకుంఠపురములో పూజ హెగ్డే ని ఎలా చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటీ మొదలైంది. పూజ ని పూజలాగే అందంగా చూపిస్తాడో లేదంటే... మరేదన్న లోపాన్ని పూజకి త్రివిక్రమ్ తగిలిస్తాడో చూడాలి.
 

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.