(Local) Fri, 15 Nov, 2019

నన్ను కాపాడండి ఏపీ సీఎం కు....బండ్ల గణేష్

October 05, 2019,   2:12 PM IST
Share on:
నన్ను కాపాడండి ఏపీ సీఎం కు....బండ్ల గణేష్

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ పై జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘టెంపర్‌’ సినిమాకి బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరించారు. టెంపర్ సినిమాకి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్‌ చేశారు. కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ అడుగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దానితో అక్టోబర్ 4న శుక్రవారం రాత్రి బండ్ల గణేష్ వైసీపీ నేత, సినీ ప్రొడ్యూసర్ పొట్లూరి వరప్రసాద్‌ ఇంటికి తన అనుచరులతో కలిసి వెళ్లి దాడికి పాల్పడ్డారని పీవీపీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు బండ్ల గణేష్ తో పాటు మరో నలుగురి పై 448, 506, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ పలు సంచలన ట్వీట్లు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత పొట్లూరి వరప్రసాద్ పై సంచలన ఆరోపణలు చేశారు. 
ఆయన ట్వీట్స్ యధాతధంగా "గౌరవనీయులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి, సార్ మమ్మల్ని అందరినీ పివిపి బారి నుంచి కాపాడండి, అందరూ ఆంధ్రప్రదేశ్ లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనంద పడుతూ ఉంటే, తులసివనంలో గంజాయి మొక్కలు వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి, నీకు చెడ్డ పేరు వస్తుంది. ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అంటున్నాడు. రాజన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాంటి దుర్మార్గుడి చేతినుంచి కాపాడండి సార్. మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు దయచేసి కట్టడి చేయండి. ఈ సందర్భంగా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన బండ్ల గణేశ్, పీవీపీ తనను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రక్షణ కోసం తాను పోలీసులను ఆశ్రయించానని, అంటూ బండ్ల గణేష్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అలాగే ఆ ట్వీట్స్ అన్నిటిలో జగన్, సీఎంవోను కూడా ట్యాగ్ చేశారు.

సంబంధిత వర్గం
లోకో పైలట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
లోకో పైలట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.