(Local) Sat, 24 Jul, 2021

బిగ్ బాస్ హోస్ట్‌గా టాలీవుడ్ క్వీన్....

August 31, 2019,   6:07 PM IST
Share on:
బిగ్ బాస్ హోస్ట్‌గా టాలీవుడ్ క్వీన్....

బుల్లితెరపై ప్రేక్షకులని అక్కటుకునే షో బిగ్ బాస్. తెలుగు బిగ్ బాస్ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తెలుగులో రెండు సీజన్ లు కంప్లీట్ చేసుకున్న ఈ బిగ్ బాస్ షో మూడోవ సీజన్లో మాత్రం ఓ స్పెషల్ ఎపిసోడ్ తో మన ముందుకి రాబోతోంది. అక్కినేని కింగ్ ప్లేస్ లో హోస్ట్ గా విలక్షణ నటి, సీనియర్ గ్లామర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించబోతోంది. ఈ బిగ్‌బాస్‌ రాజ్యాన్ని చక్కదిద్దేందుకు శివగామి అధికారాన్ని చేపట్టింది. ఈ వీకెండ్‌లో హోస్ట్‌గా వచ్చి.. ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు రమ్యకృష్ణ రెడీ అయింది. నాగార్జున తన బర్త్ డే వేడుకల కోసం స్పెయిన్ వెళ్లారు. ఆగస్టు 29న నాగార్జున బర్త్ డే కావడంతో అమల, సమంత, నాగచైతన్య, అఖిల్ అందరూ కలిసి స్పెయిన్‌లో బర్త్ డే టూర్‌లో ఉన్నారు. .కాబట్టి బిగ్‌బాస్ 3లో ఈవారం హోస్ట్‌గా నాగ్ క‌న‌ప‌డ‌టం లేదు. అయితే స్టార్ మా యాజమాన్యం బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా శివగామిని తీసుకొచ్చారు. అందుకు  సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది.  ప్రోమో ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

'వెన్ ది కింగ్ ఈజ్ అవే, క్వీన్ అరైవ్డ్' అంటుండగా.. రమ్యకృష్ణ గంభీరంగా నడుచుకుంటూ వచ్చి..'ఇదే నామాట.. నా మాటే శాసనం' అనే డైలాగ్ చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి కింగ్ లేకుండా క్వీన్ ఈ బిగ్ బాస్ రాజ్యాన్ని ఎలా నడిపిస్తుందో చూడాలి మరి.... 

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.