(Local) Sat, 07 Dec, 2019

నిబంధనలను అతిక్రమించిన మరో హీరోకి.....ఫైన్

August 14, 2019,   1:44 PM IST
Share on:
నిబంధనలను అతిక్రమించిన మరో హీరోకి.....ఫైన్

వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌ ఝలక్ ఇవ్వబోతోంది. ట్రాఫిక్ నిబంధలను మరింత కఠినం చేసే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ట్రాఫిక్ రూల్స్‌ కి సామాన్య ప్రజానీకమే కాదు సెలెబ్రిటీస్ సైతం ఎవరు అతీతులు కాదని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. ఇటీవల అల్వాల్ సమీపంలో మంచిర్యాల జాయింట్ కలెక్టర్ కారు ఓవర్ స్పీడ్‌తో వెళ్లడంతో చలాన్ వేయడం తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు కూడా చలనాలు పడ్డాయి.  తాజాగా మరో టాలీవుడ్ యంగ్ హీరోకి ఫైన్ విధించారు.  పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు బంజారాహిల్స్ రోడ్‌లో రెగ్యూలర్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో హీరో నాగశౌర్య కారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 నుంచి వెళ్తుండగా పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్ ఐ రవి నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేసి జరిమానా వేశారు. కారులో ఉన్న మనిషి కనిపించకుండా..కారు విండోలకు బ్లాక్ ఫిల్మ్ లను పెట్టుకోవడం సెంట్రల్ మోటార్ వెహికిల్ నిబంధనలు, సుప్రీంకోర్టు రూల్-2012 ఉల్లంఘన కిందికి వస్తోంది. కాగా నాగశౌర్య  కారుకు ఉన్న నిషేధిత బ్లాక్ ఫిల్మ్ తొలగించి అప్పటికప్పుడే  రూ. 500 జరిమానా విధించారు. 
 

సంబంధిత వర్గం
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.